స్పీకర్ తమ్మినేని సీతారాం కు తన స్వంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చేదు అనుభవం ఎదురైంది.బుధవారం నాడు ఆమదాలవలస నియోజకవర్గ పరిధి నెల్లిపర్తి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని అధికారులు, శ్రేణులతో కలసి పాల్గొన్నారు.
గడప గడపకు చేరుకుంటూ.చేరువ చేసిన ప్రభుత్వ పధకాల గురించి స్థానికులకు చెబుతున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన శెట్టి పద్మ అనే మహిళ స్పీకర్ తమ్మినేనిపై విరుచుకుపడింది.
తాను గతంలో గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పని చేశానని.అలాంటి తనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలంటూ స్పీకర్ ను ఘాటుగా కోరింది.నలుగురిలో జరిగిన ఈ హఠాత్ పరిణామానికి స్పీకర్ కూడా అవాక్కయ్యారు.దీనిపై పరుషంగా బదులిచ్చారు.
నీకు ఇష్టమ్మున్న చోట చొప్పుకో పో అంటూ ఆ మహిళకు ఘాటుగా బదులిచ్చారు.గడచిన ఇరవై అయిదేళ్లుగా తమ వెనుక తిరిగినందుకు సరైన బహుమతి ఇచ్చారని.
ఈసారి ఎలా గెలుస్తారో చూసుకోండి అంటూ ఆ మహిళ సైతం అంతే స్థాయిలో రిప్లై ఇచ్చింది.సమస్య చెప్పుకుంటే స్పందించే తీరు ఇదేనా అంటూ సదరు మహిళ వాపోతోంది.







