కీకీ ఛాలెంజ్‌ తర్వాత ఇప్పుడు కొత్త ఛాలెంజ్‌ మొదలైంది... ఇలా మీరు మాత్రం దయచేసి ట్రై చేయవద్దు

ఆమద్య ఐస్‌ బక్కెట్‌ ఛాలెంజ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్‌ అయిన విషయం తెల్సిందే.

ఆ ఛాలెంజ్‌ తర్వాత కీకీ ఛాలెంజ్‌ అంటూ 2018 సంవత్సరంలో చాలా ఫేమస్‌ అయ్యింది.

నడుస్తూ ఉన్న వెయికిల్‌ నుండి కీకీ మ్యూజిక్‌కు డాన్స్‌ చేయడం.ఆ ఛాలెంజ్‌ చట్ట రీత్యా నేరం అంటూ పోలీసులు హెచ్చరించినా కూడా ఎంతో మంది ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి సరదాగా నడుస్తున్న కారులోంచి దిగి దుమ్ము రేగిపోయేలా డాన్స్‌ వేశారు.

ఇంకా కూడా కొంత మంది ఈ కీకీ ఛాలెంజ్‌ ను కొనసాగిస్తూనే ఉన్నారు.

కీకీ ఛాలెంజ్‌ తర్వాత ఈమద్య కొత్త ఛాలెంజ్‌ ఒకటి పుట్టుకు వచ్చింది.అదే బర్డ్‌ బాక్స్‌ ఛాలెంజ్‌, ఈ ఛాలెంజ్‌ ఏంటీ అంటే తల్లి లేదా తండ్రి కళ్లకు గంతలు కట్టుకుని, పిల్లలకు కూడా గంతలు కట్టి ఏ పని అయినా చేయాల్సి ఉంటుంది.పిల్లలకు గంతలు కట్టడం వల్ల వారు ప్రమాదంకు గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఎంతో మంది కూడా ఈ బర్డ్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సరదాగా వీడియోలు చేస్తున్నారు.ఈ సరదా వీడియోలు కాస్త కొన్ని చోట్ల విషాదంను కూడా మిగుల్చుతున్నాయి.

పిల్లలకు లేదంటే పెద్ద వారికి చిన్న చిన్న గాయాలు అవుతున్నాయి.

అసలు ఈ బర్డ్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ ఎలా ప్రారంభం అయ్యిందంటే.వరల్డ్‌ ఫేమస్‌ నెట్‌ ప్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న వెబ్‌ సిరీస్‌ బర్డ్‌ బాక్స్‌లో ఒక తల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నంను అద్బుతంగా చూపించారు.కొన్ని కారణాల వల్ల తన ఇద్దరి పిల్లలకు కళ్లకు గంతలు కట్టి, తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుని వారికి సంబంధించిన పనులు అన్నీ చేస్తూ ఉంటుంది.-->ఆ సినిమా చాలా సూపర్‌ హిట్‌ అయ్యింది.దాంతో అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇప్పుడు బర్త్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ అంటూ పెద్ద ఎత్తున ఫేమస్‌ అయ్యింది.ఇండియాలో ఇంకా ఇలాంటి ఛాలెంజ్‌ ఏమీ రాలేదు.

బర్డ్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ను మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయవద్దు.ఎందుకంటే అది ప్రమాదం.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

బర్డ్‌ బక్స్‌ ఛాలెంజ్‌ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు