ఇదేందయ్యా ఇది : పెళ్లి మీద అభిప్రాయం చెప్పమంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ రిపోర్టర్ ని...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఎలాంటి విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతోంది.

 తాజాగా ఓ న్యూస్ రిపోర్టర్ యువకుడిని పెళ్లి మరియు కట్నం అనే అంశంపై ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే బీహార్ కి చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ సమాజంలో కట్నం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు స్థానిక ప్రజలతో ఇంటర్వ్యూ నిర్వహించింది.ఈ క్రమంలో ఓ యువకుడిని ఈ విషయంపై అడగ్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి ఆడ పిల్లల జనాభా తగ్గిపోయిందని అంతేకాక పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు ఉంటే చాలని కట్న కానుకలు అవసరం లేదని తెలిపాడు.

ఆ తరువాత ఏకంగా న్యూస్ రిపోర్టర్ ని నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాని మీకు ఇష్టమేనా అంటూ పెళ్లి ప్రపోజల్ చేశాడు.దీంతో ఒక్కసారిగా న్యూస్ రిపోర్టర్ ఖంగు తింది.

 అయితే ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఈ సంఘటనని తన చరవాణిలో బంధించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement

దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడపిల్లలని పురిట్లోనే చంపేస్తున్నారని అందువల్లే ప్రస్తుతం పెళ్లి కోసం ఆడపిల్లలు కరువయ్యారని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..
Advertisement

తాజా వార్తలు