డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే మనకు తెలియకుండానే చేజారి పోతాయి.
డబ్బు విషయంలో కొద్దిగా నిర్లక్యంగా ఉన్న తర్వాత చాలా పరిణామాలు ఎదుర్కోవాలి.మాములు మనుషులే జాగ్రత్తగా ఉండాలి అంటే.
మరి బ్యాంక్ లో జాబ్ చేస్తున్న అధికారి ఇంకెంత అలర్ట్ గా ఉండాలి.బ్యాంకు లో పని చేస్తున్న వాళ్ళు చిన్న మిస్టేక్ చేసిన దాని ఫలితాలు పెద్దగా ఉంటాయి.
బ్యాంక్ అధికారులు కూడా ఒక్కోసారి పొరపాటు చేస్తూ ఉంటారు.అధికారుల పొరపాటు కారణంగా ఒక్కోసారి డబ్బు సరైన వ్యక్తుల ఖాతాలో జమ అవ్వకుండా వేరే వాళ్ళ ఖాతాలోకి వెళ్లిపోతూ ఉంటాయి.
ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు ఆ సంబంధిత బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి ఆ డబ్బును ఆ ఖాతా నుండి తీసుకుంటారు.కానీ ఒక్కోసారి బ్యాంక్ అధికారులు చూడకపోతే ఆ డబ్బు ఎలాంటి పరిణామాలు వస్తాయో.
ఇలాంటి పొరపాట్లు చాలా సార్లు జరిగే ఉంటాయి.కొన్ని కోట్ల రూపాయలు మాయమయినప్పుడు కూడా అధికారులు ఇలాంటి సమస్య ఎదుర్కొని ఉండరు.కానీ ఇప్పుడు ఒక అధికారి పొరపాటున వేరే వ్యక్తి ఖాతాలో 5.5 లక్షల రూపాయలను వేసాడు.

కానీ ఆ విషయం ఆలస్యంగా గ్రహించి ఆ సదరు అకౌంట్ వ్యక్తిని అడిగారు.అతడు చెప్పిన విషయం విని ఆ బ్యాంక్ అధికారి షాక్ అయ్యాడు.
ఆ బ్యాంక్ అధికారి ఆ డబ్బు వేసిన కొన్ని రోజుల తర్వాత ఆ సదరు వ్యక్తికి మీ అకౌంట్ లో డబ్బు పొరపాటున పడిందని ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఫోన్ చేసి అడిగాడు.
అయితే ఆ అధికారికి అతడు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు.ఇంతకీ అంత షాక్ అయ్యే సమాధానం ఏం చెప్పాడా అని ఉహించు కుంటున్నారా.ఆ అకౌంట్ కలిగిన వ్యక్తిని తన ఖాతాలో డబ్బుము తిరిగి ఇవ్వమని అడగగా.

ఆ డబ్బును మోడీ నుండి వచ్చిందని అనుకుని ఖర్చు చేశామని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు.అతడి ఖాతాలో పడిన డబ్బంతా వాడుకున్నానని ఇప్పుడు నా ఖాతాలో ఏమీ లేవని నేను తిరిగి ఇవ్వలేనని అతడు చెప్పేసాడు.దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు.ప్రధాని మోడీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తున్నడనై వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇవి కూడా అలాగే వచ్చాయని అనుకున్నానని అతడు తెలిపాడు.