ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి( TDP alliance ) క్వీన్ స్వీప్ చేస్తుంది.ఈ మేరకు అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీకి ఇది ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు.సుమారు ఐదు జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు.
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో కూటమి క్వీన్ స్వీప్ చేసింది.ఈ క్రమంలోనే దీన్ని టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా అభివర్ణించవచ్చు.
కాగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి సుమారు 131 స్థానాల్లో టీడీపీ లీడింగ్ లో ఉంది.జనసేన 20 స్థానాలు, బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.