Faima Revanth : రేవంత్ కి వార్నింగ్ ఇచ్చిన ఫైమా.. నువ్వు నాకు చెప్తున్నావా అంటూ ఫైర్?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే బిగ్ బాస్ హౌస్లో తాజాగా నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

అయితే నామినేషన్స్ వచ్చాయి అంటే చాలు హౌస్ లో వేడి పెరిగిపోతూ ఉంటుంది.అయితే ఈ వారం నామినేషన్స్ ప్రకారం మరింత రచ్చ రచ్చగా సాగినట్లు తెలుస్తోంది.

అయితే బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ల మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ నడుస్తోంది.ఎవరు ఏ మాత్రం తగ్గకుండా టాస్కుల విషయంలో ఒళ్ళు హునం చేసుకుంటూ ఆడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఫైమా రేవంత్ పై ఒక రేంజ్ లో విరుచుకు పడింది.నేనే స్ట్రాంగ్ నేనే తోపు అనుకుంటూ ఫీలయ్యే రేవంత్ కి ఎదురు తిరిగి గట్టిగానే సమాధానం చెప్పింది పైమా.

Advertisement

వేరే వాళ్ళ సపోర్ట్ లేనిదే గేమ్ ఆడ లేవు నువ్వు నాకు చెప్తున్నావా అంటూ రేవంత్ మీద ఒక రేంజ్ లో విరుచుకు పడింది.సపోర్ట్‌తో ఆడిన రేవంత్‌ సపోర్ట్‌ గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించింది.

మనిషి ముందు ఒకలా, వెనకాల మరోలా మాట్లాడతాడు.ఎవరికీ ఇది కనిపించట్లేదా? అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లపై సీరియస్ అవ్వడంతో అందరూ బిక్క ముఖాలు వేశారు.ముందు నుంచీ తాను నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది.

కరెక్ట్‌ పాయింట్లు లాగడంతో రేవంత్‌ దెబ్బకు సైలెంట్‌ అయిపోయాడు.ఎంతసేపూ నేనే స్ట్రాంగ్‌, నా ముందు మాట్లాడే ధైర్యం లేదు, వాళ్లకంత సీన్‌ లేదు అంటూ తోటికంటెస్టెంట్లను చులకన చేసి మాట్లాడే రేవంత్‌ నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలంటే ఫైమానే కరెక్ట్‌ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.ఫైమాతోనే కాకుండా ఆదిరెడ్డి తో కూడా రేవంత్ గట్టిగానే పోట్లాడాడు.

ఆదిరెడ్డి కూడా రేవంత్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు.రేవంత్ ధైర్యం ఉంటే మాట్లాడు అనడంతో ఆదిరెడ్డి కౌంటర్లు వేస్తూ రేవంత్ బ్రో ధైర్యంతోనే మాట్లాడుతాను బ్రో అంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రేవంత్ ని నామినేట్ చేస్తూ రేవంత్ తో ఫైట్ కి దిగారు.

Advertisement

తాజా వార్తలు