బిగ్‌బాస్‌ షో చూసి విడిపోవాలనుకోవడం మూర్ఖత్వం.. దీప్తిది ఫేక్ రిలేషన్ అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ఊహించని స్థాయిలో ఆదరణ ఉందనే సంగతి తెలిసిందే.

ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ గా ఈ షో కొనసాగుతోంది.

అయితే ఈ షో షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనా బ్రేకప్ కు కారణమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు దీప్తి సునైనా పోస్ట్ పెట్టడంతో బిగ్ బాస్ షో వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో 24 గంటల్లో జరిగిన దానిని కేవలం గంటలో ప్రసారం చేస్తారు.ఇలా చేయడం వల్ల టీవీలో ఏవి ప్రసారం అవుతున్నాయో ఏవి ప్రసారం కావడం లేదో హౌస్ లో ఉన్నవాళ్లకు తెలియదు.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా సిరితో స్నేహం వల్ల అతనికి ఇబ్బందులు ఎదురయ్యాయి.షణ్ముఖ్ దీప్తి సునైనాతో లవ్ లో ఉండగా సిరి, శ్రీహాన్ కు నిశ్చితార్థం జరిగింది.

Advertisement

అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం హద్దులు మీరి షణ్ముఖ్, సిరి ప్రవర్తించడంతో నెటిజన్లు సిరి, షణ్ముఖ్ స్నేహం పేరుతో తప్పుగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు.అయితే దీప్తి సునైనా బ్రేకప్ చెప్పడంతో దీప్తిపై సైతం నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.దీప్తి, షణ్ముఖ్ ల రిలేషన్ షిప్ ఫేక్ రిలేషన్ షిప్ అని కామెంట్లు చేస్తున్నారు.

గంట సమయం ప్రసారమయ్యే రియాలిటీ షోను చూసి విడిపోవాలనుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కేవలం ఒకే ఒక రియాలిటీ షో వల్ల ఐదేళ్ల బంధం విడిపోతుందంటే ఆ బంధం ఎంత వీక్ బంధమో అర్థమవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.సిరి శ్రీహాన్ జోడీ సంతోషంగా ఉండగా మీరు విడిపోవడంలో అర్థం లేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.నెటిజన్ల కామెంట్ల విషయంలో దీప్తి సునైనా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు