బిగ్ బాస్ తెలుగు సీజన్ 6….ఎన్నో అంచనాల మధ్య రెండు వారాలకు చేరుకున్న ఈ సీజన్ ఇప్పటివరకు చప్పగానే సాగుతోంది.
కంటెస్టెంట్స్ ఎవరు ఊహించని విధంగా బయటకు రావడం లేదు.కెమెరాలు ముందు కూడా కనిపించకుండా షోని నడిపిస్తున్నారు.
ఇక ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనాలంటే కంటెస్టెంట్స్ కి ఒక సెంటిమెంటు కొనసాగుతూ వస్తుంది.ప్రతి ఇంటి సభ్యుడికి ఒక కథ ఉండాలి అనేది ఈ బిగ్ బాస్ నియమంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే తండ్రి చనిపోవాలి, లేదంటే తల్లి చనిపోయి ఉండాలి లేదా కుటుంబంలో ఏదైనా పెను ప్రమాదం జరిగి ఉండాలి ఇదే తీరుని ఫాలో అవుతూ ఇంటి సభ్యులను ఎంచుకుంటూ పోతుంది బిగ్ బాస్ యాజమాన్యం.
ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా ఇలాంటి తరహా కంటెస్టెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.
తమ కుటుంబంలో లేని ఓ వ్యక్తి గురించి చెప్పి ఎమోషనల్ అవుతూ ఎపిసోడ్ ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.అలా చలాకి చంటి తన తల్లి చనిపోయిన విధానం గురించి ఎమోషనల్ అవుతూ చెప్పడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
మరొక ఇంటి సభ్యురాలు కీర్తి సైతం తన కుటుంబం ప్రమాదంలో చనిపోయిన తీరు చెప్పి కన్నీటి పర్యంతమైంది.ఇక ఇదే క్రమంలో వినాయ సుల్తానా సైతం తన తండ్రి చనిపోయాడని తన పేరుని నిలిపేందుకే బిగ్ బాస్ కి వచ్చానని చెబుతూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసింది.

ఇక సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి సైతం తన తల్లి చనిపోవడంతో తాను ఎంతగానో కృంగిపోయినట్టు తెలిపాడు.ఆమెకు తన సక్సెస్ చూపించలేకపోయాను అంటూ బాధపడ్డాడు కూడా.ఇక మరో వైపు సింగర్ రేవంత్ సైతం చిన్ననాటి తండ్రిని కోల్పోయి ఎన్నో కష్టాలు పడి పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే.ఇక త్వరలోనే తండ్రిగా కాబోతున్న రేవంత్ తన తండ్రిని చూడకపోవడం తనకు ఎంతో బాధాకరం అంటూ తెలియజేశాడు.
ఇక అభినయ శ్రీ సైతం చిన్ననాడే తండ్రిని కోల్పోయింది అలాగే ఫైమా కి కూడా తండ్రి లేడు.కానీ వారు ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం గమనించాల్సిన విషయం.
టుమారో రేపు సుదీప, మెరీనా రోహితులు తమ పిల్లలని గర్భంలోనే కోల్పోయిన విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఇలా బిగ్ బాస్ ప్రతిసారి కూడా ఆ ఇంటి సభ్యులకు ఎమోషనల్ టచ్ చేస్తూ ఎపిసోడ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.







