తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది.మరో రెండు మూడు రోజుల్లో బిగ్ బాస్ షో ముగియనుంది.
దీంతో కంటెస్టెంట్ లలో టెన్షన్ మొదలైంది.ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు విన్నర్ గా నిలుస్తారు? రన్నరప్ గా ఎవరు నిలుస్తారు? టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్న విషయం తెలిసింది.ఇక వీరు ఆరుగురు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా జరిగిన ఎపిసోడ్ ప్రేక్షకులకు ఓట్ అప్పీల్ చేసుకునే అంశం చుట్టూ సాగింది.బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈ క్రమంలోనే మొదటి టాస్క్ లో ఆదిరెడ్డి, రోహిత్ గెలవగా వారిద్దరిలో మిగతా కంటే ఏకాభిప్రాయంతో రోహిత్ కి ఓటు వేశారు.దాంతో రోహిత్ ప్రేక్షకులకు అప్పీల్ చేశాడు.
ఇప్పటివరకు తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎలా అయిన గెలుస్తాను అని మాట ఇచ్చాడు.ఆ తరువాత టాస్కు జరుగుతున్న సమయంలో శ్రీహన్ శ్రీ సత్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
కొన్ని శబ్దాలు వచ్చే సమయంలో శ్రీ సత్య పదేపదే మాట్లాడి డిస్టర్బ్ చేయడంతో ఆ శబ్దాలు ఏంటో శ్రీహాన్ కి అర్థం కాలేదు.

దాంతో పాయింట్స్ లో శ్రీహాన్ వెనకబడ్డాడు.అనంతరం టాస్క్ ముగిసిన తర్వాత శ్రీహాన్ శ్రీ సత్యపై ఫైర్ అవుతూ వల్లే ఈ టాస్క్ ని కోల్పోయాను అంటూ శ్రీ సత్య అని నిందించాడు.అప్పుడు శ్రీ సత్య నావల్ల కేవలం రెండు పాయింట్స్ మాత్రమే పోయాయి.
మిగిలిన పాయింట్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా అంటూ శ్రీ సత్య వాదించింది.అప్పుడు శ్రీహాన్ నన్ను చెడగొట్టావు దొబ్బకు తల్లీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.







