బిగ్ బాస్ కోసం ప్రాణం ఇచ్చేస్తారు... టాస్క్ కోసం కొట్టుకునేదాకా వెళ్లిన కంటెస్టెంట్లు?

తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.మొదట్లో కొంచెం చప్పగా సాగినప్పటికీ రానురాను హౌస్ లో వివాదాలకు కొదవే లేకుండా పోతుంది.

 Bigg Boss Non Stop Promo Thaggede Le Second Week Captaincy Task Details, Bigg B-TeluguStop.com

కంటెస్టెంట్ ల మధ్య గొడవలు పోటాపోటీగా జరుగుతున్నాయి.అంతేకాకుండా మాటల తూటాలు, బూతులు కూడా మాట్లాడుకుంటున్నారు.

గత సీజన్లలో కూడా ఎప్పుడూ లేని విధంగా కంటెస్టెంట్ ల మధ్య మాటా మాటా పెరుగుతూ గొడవలు అంతకంతకూ పెరుగుతున్న ఏ తప్ప తగ్గడం లేదు.ఈ క్రమంలోనే తాజాగా చాలెంజర్స్, వారియర్స్ ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండవ కెప్టెన్సీ కోసం పోటీ మొదలైంది.ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రోమోని విడుదల చేశారు.

అందులో తగ్గేదే లే అనే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా వారియర్స్ సభ్యులు స్మగ్లర్లు గా మారగా చాలెంజర్స్ పోలీసులుగా మారుతారు.స్మగ్లర్ లను అడ్డుకోవడానికి పోలీసులు డోర్ దగ్గర ఉండడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

మేము వారియర్స్ సీనియర్స్ ఈ విధంగానే ఆడదాం అని అనగా అప్పుడు సహనం కోల్పోయిన ఆర్జె సీనియర్స్ జూనియర్స్ వద్దు అని అఖిల్ హెచ్చరిస్తాడు.మరొకవైపు నటరాజ్ మాస్టర్ పొట్టి చేసుకుందాం అన్నావ్ కదా, రా అంటూ యాంకర్ శివ మీదకు వెళ్ళాడు.

దీనితో పక్కన ఉన్న కంటెస్టెంట్ లు వారిద్దరిని కూల్ చేసే ప్రయత్నం చేశారు.మరొకవైపు టాస్క్ లో భాగంగా శ్రీ రాపాకకు గాయం అయినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ నాన్ స్టాప్ తొలివారంలో తేజస్వి కెప్టెన్ గా నిలిచిన విషయం తెలిసిందే.మరి మొదటి వారం కెప్టెన్ గా వారియర్స్ నిలవగా మరి రెండవ వారం చాలెంజర్స్ గెలుస్తారా? లేక వారియర్స్ టీమ్ నుంచి మరొకరు కెప్టెన్ అవుతారా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube