శ్రీసత్యకు లవ్ ప్రపోజ్ చేసిన బిగ్ బాస్ మెహబూబ్.. ఆమె ఏమన్నారంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో శ్రీసత్య, మెహబూబ్ ముందువరసలో ఉంటారు.

శీసత్య ప్రేమ, పెళ్లి, నిశ్చితార్థంకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

మొదట మెహబూబ్ శ్రీసత్య దగ్గరకు వెళ్లి తాను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేనని అన్నారు.కొరియోగ్రాఫర్లు ప్రియాంక, సంకేత్ సహాయంతో మెహబూబ్ శ్రీసత్యకు ప్రపోజ్ చేయడం గమనార్హం.

తననే ప్రేమిస్తున్నానని మెహబూబ్ చెప్పడంతో షాకవ్వడం శ్రీసత్య అవుతోంది.శ్రీసత్య మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోనే లవ్ వల్ల పెంట అయిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని కామెంట్ చేశారు.

మెహబూబ్ మాట్లాడుతూ నువ్వు, నీ క్యారెక్టర్ నాకు ఎంతగానో నచ్చాయని వెల్లడించడం గమనార్హం.

Advertisement

శ్రీసత్య లాంటి మంచి అమ్మాయిని వదులుకోవాలని నాకు లేదని మెహబూబ్ తెలిపారు.ఆ తర్వాత మెహబూబ్ తాను చేయి కోసుకుంటానంటూ కామెంట్లు చేశారు.ఆ తర్వాత శ్రీసత్య ఇప్పటికే నేను ఆత్మహత్యాయత్నం కూడా చేశానని వెల్లడించారు.

నా నిశ్చితార్థం బ్రేకప్ తర్వాత మరో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నానని ఆమె తెలిపారు.నాకు మనుషుల మీదే నమ్మకం పోయిందని ఆమె అన్నారు.

అయితే శ్రీసత్య, మెహబూబ్ కలిసి ప్రాంక్ వీడియో చేశారని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.సంకేత్, ప్రియాంకలకు షాకివ్వడానికి వాళ్లిద్దరూ కలిసి ఈ విధంగా ప్రాంక్ చేశారు.ప్రస్తుతం మెహబూబ్ శ్రీసత్యల లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొంతమంది ఈ వీడియో గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తుంటే ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీసత్యకు రోజురోజుకు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు