శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఫిదా సినిమా ( Fida movie )ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.
దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమాలో సాయిపల్లవి అక్క పాత్రలో శరణ్య ప్రదీప్( Sharanya Pradeep ) నటించి మెప్పించారు.తెలంగాణ యాసలో శరణ్య ప్రదీప్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ పాత్రలో నటించే అవకాశం వచ్చినా తెలంగాణ యాసలో మాట్లాడలేకపోవడం వల్ల ఛాన్స్ పోయిందని హరితేజ( Hariteja ) చెప్పుకొచ్చారు.రెండు మూడుసార్లు నేను అడిషన్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని హరితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మామా మశ్చీంద్ర ఈవెంట్ లో హరితేజ మాట్లాడుతూ శేఖర్ కమ్ముల గారిని చూడగానే ఒకటి గుర్తొచ్చిందని చెప్పుకోవాలనిపిస్తోందని ఆమె అన్నారు.

నేను శేఖర్ కమ్ముల గారి సినిమాలకు అభిమానినని ఆమె అన్నారు.ఫిదా సినిమాలో అక్క రోల్ కోసం నన్ను అడిషన్ కు పిలిచారని హరితేజ చెప్పుకొచ్చారు.ఎలాగైనా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేయాలని మూడుసార్లు అడిషన్ కు వచ్చానని ఆమె కామెంట్లు చేశారు.
తెలంగాణ యాస వల్ల ఆ మూవీ ఆఫర్ పోవడంతో ఆ తర్వాత తెలంగాణ యాస నేర్చుకున్నానని హరితేజ కామెంట్లు చేశారు.

ఇప్పుడు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సార్ అంటూ హరితేజ వెల్లడించారు.తెలంగాణ యాసలో మరీ అంత ప్యూర్ గా మాట్లాడతానని చెప్పలేను కానీ నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నానని ఆమె అన్నారు.మామా మశ్చీంద్ర సినిమాలో ఓల్డ్ ఉమెన్ గెటప్ లో హరితేజ కనిపించనున్నారు.
ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాల్సి ఉంది.







