తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కు సమయం దగ్గర పడింది.ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి.ఇప్పటికే బిఆర్ఎస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా , కాంగ్రెస్ బిజెపిలు మరికొద్ది రోజుల్లోనే ఆ జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్( Congress ) లో భారీగానే చేరికలు చోటు చేసుకుంటున్నా, వలస నాయకులు కారణంగా సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు .అధికార పార్టీ బీఆర్ఎస్ లోను అదే పరిస్థితి నెలకొంది.టిక్కెట్లు దక్కలేదనే అసంతృప్తితో చాలామంది సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి, ఇతర పార్టీలో చేరుతుండడం బీఆర్ఎస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మల్కాజ్ గిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mynampally hanumanta rao )కు టికెట్ ఖరారు చేసినా, తన కుమారుడు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ స్థానం ఇవ్వకపోవడంపై అలక చెంది మైనంపల్లి కాంగ్రెస్ లో చేరారు.టికెట్ ఇవ్వని అనేక మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా, ఎమ్మెల్యే టికెట్ రాలేదని అసంతృప్తితో రాజీనామాలు చేస్తుండడంతో, బిఆర్ఎస్ అలర్ట్ అయింది .ఈ మేరకు జిల్లాల వారీగా అసమ్మతి నేతలు ఎవరు ? పార్టీని వీడేందుకు ఎవరు సిద్ధమవుతున్నారు ? ఏ పార్టీలో చేరబోతున్నారు ? వాళ్ళ అసంతృప్తికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై కేసీఆర్ తీస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.బీఆర్ఎస్ టికెట్ దక్కని అనేకమంది పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరారు. ఎమ్మెల్సీగా ప్రస్తుతం పని చేస్తున్న వారు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి( Kasireddy Narayana Reddy ) పార్టీకి రాజీనామా చేశారు.మరో ఎమ్మెల్సీ కూచుకోళ్ల దామోదర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.త్వరలోనే ఆయన పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది.
ఇక మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతుండడంతో, కేసిఆర్ సైతం టెన్షన్ పడుతున్నారు.ఇదే అభిప్రాయం జనాల్లోకి వెళితే అది ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు నియోజకవర్గాల వారిగా అసంతృప్తి నాయకులను గుర్తించి వారిని బజ్జగించే ప్రయత్నాలు కేసీఆర్ మొదలుపెట్టారు.








