యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర ( Devara )అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసినట్లుగా సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ అధికారికంగా ప్రకటించాడు.ఇక నేడు హిందీ సినిమా వార్ 2 కి సంబంధించిన చర్చలు హైదరాబాదులో దర్శకుడు అయాన్ ముఖర్జీ తో ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
హిందీలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా విషయంలో నందమూరి అభిమానులు ఒకింత టెన్షన్ తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఎన్టీఆర్ మొదటి సారి హిందీ సినిమా చేయబోతున్నాడు.అది కూడా హృతిక్ రోషన్ వంటి సూపర్ స్టార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఇతర హీరోల సినిమాల్లో నటించింది లేదు.
మొదటి సారి వేరే హీరో సినిమాలో నటించబోతున్న కారణంగా ఆ సినిమాలోని పాత్ర ఎలా ఉంటుంది.హృతిక్ రోషన్ ( Hrithik Roshan )డామినేషన్ ఎక్కువైతే ఎన్టీఆర్ పరువు పోతుందేమో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ స్క్రిప్ట్ వింటున్నాడు కనుక ఈ సమయంలో ఆయనకు అభిమానులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు.స్క్రిప్టులో ఎన్టీఆర్ తన పాత్రకి బలం ఉంది అంటేనే ఓకే చెప్పాలని లేదంటే సినిమా నుండి తప్పుకోవాలని వారు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ కి ఆ విషయంలో ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆయన తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకున్నాడు.కనుక వార్ 2 ( war 2 )కూడా బాగుంటేనే ఎన్టీఆర్ కమిట్ అవుతాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.బాలీవుడ్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోవడం తెలుగు వారికి గర్వకారణం అన్నట్లుగా నందమూరి అభిమానులు కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అనవసర భయాలతో టెన్షన్ పడుతున్నారు.
ఈ సంవత్సరం చివర్లో ఎన్టీఆర్ హిందీ సినిమా ప్రారంభం కాబోతుంది.వచ్చే సంవత్సరంలోనే ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఎన్టీఆర్ దేవర సినిమా కూడా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.







