చెల్లి పెన్షన్ తో బ్రతికా.. బట్టలు కూడా లేవు.. ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

బిగ్ బాస్ షో సీజన్6 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఆదిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చడానికి ఇబ్బంది పడ్డానని తెలిపారు.మా చెల్లి పెన్షన్ డబ్బులతో నేను బ్రతికానని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు.

 Bigg Boss Aadireddy Sensational Comments Goes Viral In Social Media Details, Aad-TeluguStop.com

నన్ను అందరూ ఆది అని పిలుస్తారని ఆదిరెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరికీ సమస్యలు వస్తాయని ఆదిరెడ్డి కామెంట్లు చేశారు.

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అవుతున్నానని అదిరెడ్డి తెలిపారు.లూజ్ బట్టలు వేసుకుని తిరిగి సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయని ఆయన అన్నారు.జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయని ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు.ఆత్మహత్య చేసుకుని జీవితం ఆపుకోవడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.

క్షణికావేశం వల్ల అమ్మ చనిపోయిందని ఆయన వెల్లడించారు.

టాలెంట్ లేకపోయినా నేను సక్సెస్ అయ్యానని ఆదిరెడ్డి పేర్కొన్నారు.నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆయన తెలిపారు.నేను అందరికీ కరెక్ట్ అనిపించనని ఆయన పేర్కొన్నారు.

కుటుంబం జోలికి వెళ్లకుండా నన్ను ఎవరేం అన్నా ఓకే అని ఆదిరెడ్డి వెల్లడించారు.మా చెల్లెలు కళ్లు లేకపోయినా టాకెటివ్ అని ఆయన పేర్కొన్నారు.నా ప్రయాణం విషయంలో సంతోషంగా ఉన్నానని ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు.

అదృష్టం ఏ విధంగా కలిసొస్తుందో చెప్పలేమని టైమ్ ఎప్పుడు ఏ విధంగా కలిసొస్తుందో అర్థం కాదని ఆయన అన్నారు.మా అమ్మ చనిపోకుండా ఉండి ఉంటే బాగుండేదని మా పాపలో అమ్మను చూసుకుంటున్నానని ఆదిరెడ్డి తెలిపారు.నేను సక్సెస్ కాకముందే నా పెళ్లి జరిగిందని ఆయన పేర్కొన్నారు.

నా సక్సెస్ వెనుక నా భార్య ఉందని ఆదిరెడ్డి అన్నారు.ఆదిరెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube