తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో( Bigg Boss ) చూస్తుండగానే అప్పుడే 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 10 వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది.తాజాగా 9 వ వారం ఎలిమినేషన్స్ ముగిశాయి.9వ వారం ఎలిమినేషన్స్ లో ముందుగా అనుకున్న విధంగానే కంటెస్టెంట్ తేజ( Tasty Teja ) ఎలిమినేట్ అయ్యాడు.ఇకపోతే ఎపిసోడ్ ప్రారంభంలో నాగార్జున స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఆదివారం ఫన్ డే కావడంతో కాసేపు కంటెస్టెంట్స్ అందరితో గేమ్స్ ఆడించి వారిని నవ్వించాడు.ఆ తర్వాత కొన్ని సామెతలు ఉన్న బోర్డ్స్ ఇచ్చి అవి కంటెస్టెంట్స్ లో ఎవరికీ ఏది సరిపోతుందో వాళ్ళ మెడలో వేయమన్నారు.

దీంతో కంటెస్టెంట్స్ అంతా తమ అభిప్రాయాలను ఆ సామెతల్లో చూపించారు.ఈ నేపథ్యంలోనే ఒకరితో ఒకరు వాదించుకున్నారు.ఆ తరువాత జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమా( Jigarthanda DoubleX ) ప్రమోషన్స్ లో భాగంగా సూర్య,( Surya ) లారెన్స్( Lawrence ) వచ్చి హౌస్ లో సందడి సందడి చేశారు.ఆ తర్వాత హీరోయిన్ ఈషా రెబ్బా హౌస్ లోకి వెళ్లి అమ్మాయిలతో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ పై చర్చించి వాటి గురించి అవగాహన కల్పిస్తూ మాట్లాడింది.
ఆపై నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరి సేవ్ చేసుకుంటూ వచ్చారు హోస్ట్ నాగార్జున.తర్వాత చివర్లో తేజ, రతికలను ఉంచాడు.ఈ క్రమంలోనే రతిక( Rathika ) ఎలిమినేట్ అవుతానేమో అని ముందే ఏడ్చేసింది.కానీ తేజ ఎలిమినేట్ అయ్యాడు అని నాగార్జున ప్రకటించాడు.

తేజ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో శోభా శెట్టి( Shoba Shetty ) ఫుల్ గా ఏడ్చేసింది.నువ్వు లేకుండా హౌస్ లో ఎలా ఉండాలి అంటూ ఏడుస్తూ తేజను వెళ్ళవద్దు అంటూ ఆపింది.కానీ రూల్స్ ప్రకారం వెళ్లాల్సి ఉంది కాబట్టి తేజ అక్కడి నుంచి తాను కూడా ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు.ఆపై స్టేజిపైకి వచ్చిన తేజ వెళ్లేముందు కంటెస్టెంట్స్ కి మార్కులు ఇవ్వమని నాగ్ అడగడంతో ఒక్కొక్కరికి మార్కులు ఇచ్చాడు.
అయితే అక్కడ నాగార్జున కేవలం 10 మార్కులు ఇవ్వమని చెప్పగా తేజ మాత్రం శోభా శెట్టికి ఏకంగా 20 మార్కులు ఇచ్చాడు.అందరికంటే తక్కువగా రతికా కి ఐదు మార్కులు ఇచ్చాడు.







