Faima bigg boss : సినిమాల్లోకి పంపకపోతే చచ్చిపోతా అంటూ బెదిరించింది.. ఫైమా తల్లి కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి అది తక్కువ సమయంలోనే కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది ఫైమా.

ఇకపోతే ఫైమా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఫైమా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలుస్తుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫైమా కూడా టాస్కుల విషయంలో ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి 9 వారాలు గడుస్తున్నా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది ఫైమా.

అయితే ఫైమా కి బిగ్ బాస్ షోలో అవకాశం రావడం ఇక చాలా అనే కష్టం ఉంది.కాగా ఫైమా మొదట పటాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆమె చస్తాను అని బెదిరించి మరి ఇండస్ట్రీ లోకి వచ్చిందట.ఇదే విషయాన్ని ఫైమా తల్లి చెప్పుకొచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైమా తల్లి మాట్లాడుతూ.నాకు నలుగురు ఆడపిల్లలు కాగా ఫైమా చిన్నది.

ఊర్లో కూలి పనులు చేసుకుంటూ మేము బతికే వాళ్ళము.తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు.

తినడానికి తిండి లేక పురుగులు పడిన బియ్యం నూకలు పెట్టి నా బిడ్డలను పోషించుకున్నాను భయమా చిన్నప్పటి నుంచి చాలామందికి ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు అని చెప్పుకొచ్చింది ఫైమా తల్లి.మొదట పటాస్ షో కి వెళ్ళినప్పుడు ఆమె వాయిస్ నచ్చి ఆమెను షోకి ఆహ్వానించారని ఆ విషయం మాతో చెప్పగా మేము వద్దని చెప్పాము అప్పుడు ఫైమా గదిలోకి వెళ్లి పటాస్ షో కి పంపకపోతే చస్తాను అని బెదిరించింది దాంతో ఆమెను బలవంతంగా పంపించాము అని చెప్పుకొచ్చింది ఫైమా తల్లి.ఆ తర్వాత పైమా సక్సెస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది ఫైమా తల్లి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు