ఒకరికి లైఫ్ ఇచ్చి మరీ బయటకొచ్చిన జెస్సీ.. నీ త్యాగం గ్రేట్ అంటూ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం పది వారాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే 10 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు రావాల్సి ఉండగా చాలామంది కాజల్ బయటకు వస్తుందని ఆమెకు ఓట్లు తగ్గిపోవడం కారణంగా ఈవారం ఎలిమినేషన్ అవుతుంది అంటూ భావించారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మోడల్ జెస్సీ ఎలిమినేట్ అయ్యారు.గతవారం తీవ్రమైన అనారోగ్యం కారణంగా జెస్సీ సీక్రెట్ రూమ్ కి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.

అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న తనకు పూర్తిగా ఆరోగ్యం సహకరించక పోవడం వల్ల డాక్టర్లు అతనికి మెరుగైన పరీక్షలు చేయించాలి అని చెప్పడంతో ఈ వారం సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చారు.అయితే తాను అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తున్నానని వేదికపైకి వచ్చిన జెస్సీ అనంతరం ఫోన్ ద్వారా హౌస్ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి కొన్ని సూచనలు చేశారు.

ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్ ల గురించి కూడా జెస్సీ మాట్లాడారు.ఇకపోతే నామినేషన్ లిస్టులో ఉన్నటువంటి కాజల్ బయటకు వస్తుందని భావించగా చివరి నిమిషంలో ఆమెను సేవ్ చేసి హౌస్ నుంచి జెస్సీ బయటకు వచ్చారు.

ఇలా ఆఖరి నిమిషంలో కాజల్ కి లైఫ్ ఇచ్చి తనని మరి కొన్ని వారాలు హౌస్లో ఉండేలా చేసి జెస్సీ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే హౌ సభ్యులతో మాట్లాడి వారికి వీడ్కోలు చెబుతూ ఎంతో బరువైన హృదయంతో ఈయన బయటకు వచ్చారు.

ఇలా ఒకరి కోసం త్యాగం చేయడంతో జేస్సిని పలువురు నెటిజన్లు ప్రశంసలతో పొగిడారు.ఇక శని ఆదివారాలలో నాగార్జున హౌస్ సభ్యులతో ముచ్చటించడం మనకు తెలిసింది.

నాగార్జున వచ్చి రాగానే హౌస్ సభ్యులతో మాట్లాడి వారితో పలు ఆటలు ఆడించి చివరికి నో ఎలిమినేషన్ అంటూ హౌ సభ్యులకు షాకిచ్చారు.ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ నుంచి సీక్రెట్ రూమ్ లో ఉన్నటువంటి జెస్సి బయటకు వెళుతున్నట్లు చెప్పడంతో హౌస్ సభ్యులు కూడా ఎంతో షాక్ అయ్యారు.

తాజా వార్తలు