వాహన‌దారులకు పెద్ద షాక్.. ఒక్క చలానా ఉన్నా..!

నిబంధనలు అతిక్రమించిన యెడల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వారికి ఫైన్స్ వేయడం కామనే.

కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబోయే న్యూస్ మాత్రం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టించేదే అని చెప్పొచ్చు.

తెలంగాణలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో వాహనదారులు ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుండటం మనం చూడొచ్చు.ఆఫీసు పనులు, ఇతర అవసరాల నిమిత్తం రోడ్లపైనే వారి జీవితం గడిచిపోతుంటుంది.

ఈ క్రమంలోనే ఎక్కడో చోట నిబంధనలు అతిక్రమించడం అనగా హెల్మెట్ ధరించకపోవడం లేదా ఓవర్ స్పీడ్ తదితర కారణాల రిత్యా ఏదో ఒక ఫైన్ పడుతుంటుంది.దానిని కట్టకుండానే బైక్స్‌ను మళ్లీ రోడ్ల మీదకు తీసుకొస్తుంటారు వాహనాదారులు.

కాగా, చలానా ఒక్కటి ఉన్నది కదా.ఏం కాదులే అనుకునే వారు ఉన్నారు.ఈ క్రమంలోనే వారికి షాకింగ్ న్యూస్ చెప్పారు పోలీసులు.

Advertisement

అదేంటంటే.ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా బండిని సీజ్ చేయొచ్చట.

ఈ మేరకు హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.అవునండీ.

మీరు చదివింది నిజమే.మీ వాహనంపై ఒక్క చలానా ఉన్న ట్రాఫిక్ పోలీసులు మీ బండిని సీజ్ చేయొచ్చట.

తాజాగా పర్వత్ నగర్ చౌరస్తాలో ఓ న్యాయవాది బైక్‌ను ఒక్క చలానా ఉన్న కారణంగా సీజ్ చేశారు.పూర్తి వివరాల్లోకెళితే.హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బైకుపై రూ.1,650 చలానా పెండింగ్‌లో ఉంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

అది కట్టాలని ట్రాఫిక్ పోలీసులు కోరగా, న్యాయవాది నిరాకరించాడు.ఈ నేపథ్యంలో పోలీసులు బైక్ సీజ్ చేశారు.ఒక్క చలానాకే బండిని ఎలా సీజ్ చేస్తారు? అని న్యాయవాది ప్రశ్నించారు.రూల్స్ ప్రకారమే బండి సీజ్ చేశానని పోలీసులు వివరణ ఇచ్చారు.

Advertisement

ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్క వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక్క చలానే కదా? అని లైట్ తీసుకోవద్దని, అది మీ బండిని సీజ్ చేసేంత వరకు తీసుకెళ్తుందని చెప్తున్నారు.

తాజా వార్తలు