వైసీపీకి బిగ్ షాక్ టీడీపీ అభ్యర్థి అనురాధ ఘన విజయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అనురాధ( Anuradha ) ఘనవిజయం సాధించింది.23 ఓట్లతో అనురాధ జయకేతనం ఎగురవేసింది.దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది.ఈ గెలుపు వైసీపీపై వ్యతిరేకతకు నిదర్శనం అని తెలుగుదేశం పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Big Shock For Ycp Is Tdp Candidate Anuradha's Victory , Ysrcp, Tdp, Anuradha, Ml-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ కీలకమైన చోట్ల విజయాలు సాధించడం జరిగింది.

ఏపీలో వైసీపీ( YCP ) బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థులు తిరుగులేని విజయాలు అందుకున్నారు.కాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.బ్యాక్ టు బ్యాక్ విజయాలు రావటంతో ఏపీలో టీడీపీ( TDP ) మళ్లీ పుంజుకుంటూ ఉండటంతో వైసీపీలో టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో 175 ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.ఈ ఎన్నికలలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 22 దాటాలి.దీంతో రహస్య ఓటింగ్ నేపథ్యంలో టీడీపీకీ…వైసీపీ నుండి ఓట్లు పడినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube