ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికార పీఠంపై కూర్చోవాలి అనుకుంటున్నారు.అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కూడా “వై నాట్ 175” అని మాట్లాడుతూ ఉంటారు.
అయితే అప్పట్లో మంచి పేరు ఉన్నప్పుడే ఏపీలో ఈయనకు 175 సీట్లు రాలేదు.అయితే అలాంటిది ఇప్పుడు ఈయనపై కాస్త వ్యతిరేకత ఏపీ ప్రజలకు ఉంది.
అలాంటిది ఇప్పుడు 175 సీట్లు ఎలా వస్తాయి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈయన పదేపదే వై నాట్ 175 ( Why Not 175) అని మాట్లాడడం వెనుక భారీ ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ సక్సెస్ అయితే కచ్చితంగా జగన్ సక్సెస్ అవుతారు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అసలు విషయం ఏమిటంటే.ఏపీలో వైసిపి పార్టీకి బలమైన పోటీని ఇచ్చేది కేవలం టిడిపి పార్టీ మాత్రమే.
ఇక అక్కడ టిడిపి పార్టీ జనసేన ( Janasena ) తో పొత్తు పెట్టుకుని చాలా వరకు ఓట్లను లాగేసే పనిలో ఉంది.అంతేకాకుండా బిజెపితో కూడా కాస్త సన్నిహితంగానే మెదులుతోంది.
ఈ లెక్కన టిడిపి వైసిపి పై వచ్చే ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని కొంతమంది భావిస్తున్నారు.అయితే వారి గెలుపును ముందుగానే పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశారు.
![Telugu Ap, Btech Ravi, Chandrababu, Cm Jagan, Janasena, Ysrcp-Politics Telugu Ap, Btech Ravi, Chandrababu, Cm Jagan, Janasena, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/Jagan-Janasena-Btech-Ravi-Chandrababu-naidu-tdp.jpg)
అదేంటంటే.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) ని నాన్ బెయిలబుల్ కేసులో ఇరికించారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో నెల రోజులపాటు ఆయనను జైలు నుండి వదిలేశారు.ఇక నెల రోజులయ్యాక మళ్ళీ జైల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్లడమే.
అయితే టిడిపి పార్టీని దెబ్బ కొట్టేలా ఎవరైతే రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా టిడిపి పార్టీ నుండి పోటీ చేస్తారో వారందరిపై లేనిపోని కేసులు పెట్టి కోర్టు ల చుట్టూ,పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేయాలని ఓ పెద్ద వ్యూహం పన్నారట జగన్మోహన్ రెడ్డి.
![Telugu Ap, Btech Ravi, Chandrababu, Cm Jagan, Janasena, Ysrcp-Politics Telugu Ap, Btech Ravi, Chandrababu, Cm Jagan, Janasena, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/ap-politics-CM-Jagan-Janasena-Btech-Ravi-Chandrababu-naidu.jpg)
ఇక దానికి ప్రధాన ఉదాహరణగా పులివెందుల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి ( Btech Ravi ) ని తీసుకోవచ్చు.ఆయన ఎప్పుడో సంవత్సరం కింద జరిగిన దానికి నిన్న అరెస్టు చేసి జైల్లో నాన్ బెయిబుల్ కేసు కింద ఇరికించారు.ఇలా చాలామంది టిడిపి నాయకులను ఏదో ఒక కేసులో ఇరికించి ఎలక్షన్ టైం లో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారట.
ఇక ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే టిడిపి ( TDP ) నాయకులందరూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండరు.దాంతో తమ ప్రచారానికి ఎలాంటి డోకా ఉండదని, అలాగే ఈసారి కూడా తమదే విజయం అని, అందుకే జగన్మోహన్ రెడ్డి పదేపదే “వైనాట్ 175” అంటూ జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.