తెలంగాణ‌లో పీకేకు బిగ్ ఛాలెంజ్ ? ఎందుకంటే .. ?

పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే) ఈ పేరు ప్ర‌స్తుతం తెలంగాణ‌లో తీవ్ర చ‌ర్చ‌గా మారింది.

సీఎం కేసీఆర్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకేను ఎంగేజ్ చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఏదో అంశం తెర‌మీద‌కొస్తోంది.

ఉద్య‌మాల పురిటిగ‌డ్డ తెలంగాణ‌లో మాత్రం పీకేకు స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.ఒక‌విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్య‌మాలు దేశాన్నే క‌దిలించాయి.

పాల‌కులు సైతం బెంబేలెత్తారు.అలాంటి తెలంగాణ‌లో రాజ‌కీయాలు చేయ‌డమంటే అంత ఈజీ కాదు.

అందుకే తెలంగాణ‌లో పీకే ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని మేధావులు పేర్కొంటున్నారు.అధికార తెరాస కాంట్రాక్ట్ ఒప్పుకున్న పీకే స‌వాళ్ల‌ను ఎదుర్కొనాలంటే గ్రామ‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేయాలి.

Advertisement

ఇదే పీకేకు బిగ్ ఛాలెంజ్‌గా మారింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.దీనికి కార‌ణం లేక‌పోలేదు.

గ్రామాల్లో కాంగ్రెస్‌కు మంచి ప‌ట్టుంది.బీజేపీ సైతం పోటీ ఇస్తోంది.

సోష‌ల్‌మీడియా బీజేపీకి బ‌లంగా ఉంది.కాంగ్రెస్ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌కు కూడా యూత్ పాలోయింగ్‌తోపాటు మంచి క్రేజ్ ఉంది.

ఇప్ప‌డు పీకే వ‌చ్చి ఏదో చేస్తాన‌నుకుంటే కుద‌ర‌ని ప‌ని.సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్‌ను ప్ర‌మోట్ చేయాలంటే బీజేపీ, కాంగ్రెస్ ధీటుగా స‌మాధానాలు చెప్పాలి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అంతేకాని, ఇత‌ర రాష్ట్రాల‌లో మాదిరిగా తెలంగాణ‌లో వ్యూహాలు ర‌చిస్తే సాగ‌వ‌ని స‌మాచారం.

Advertisement

అయితే పీకే ఏదో ఒక రూపంలో సున్నిత‌మైన భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డం, మ‌తాలు, కులాల మ‌ద్య చిచ్చు పెట్ట‌డం లాంటివి చేస్తుంటాడ‌ని టాక్‌.ఏపీలో ప‌థ‌కాలు, మూడు రాజ‌ధానులంటూ వ్యూహం ర‌చిస్తే ప్ర‌జ‌లు ఇక్క‌ట్ల పాల‌వుతున్న ప‌రిస్థితి.చివ‌రికి రాజ‌ధాని లేద‌నే అభిప్రాయంలో ప్ర‌జ‌లు ఉన్నారు.

ఇవ‌న్నీ పీకే వ్యూహాల ఫ‌లిత‌మేన‌ని టాక్‌.తెలంగాణ‌లో కూడా ప్ర‌జ‌లు చైత‌న్యం దిశ‌గా సాగుతున్నారు.

గ్రామాల్లో సైతం సోష‌ల్ మీడియాపై అవ‌గాహ‌న‌, సామాజిక స్పూర్తిపై అవ‌గాహ‌న క‌లిగి ఉంటున్నారు.ఈక్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు పీకే వ్యూహం ర‌చిస్తే సాగ‌వ‌ని స‌మాచారం.

కాంగ్రెస్‌, బీజేపీ కూడా పీకేపై విరుచుకుప‌డేందుకు సోష‌ల్‌మీడియా వినియోగించుకోవాల‌ని భావిస్తున్నాయి.మొత్తంగా పీకే త‌న వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెడ‌తారా ? లేదా అన్న‌ది వేచి చూడాలి.

" autoplay>

తాజా వార్తలు