ఆ కంటెస్టెంట్ ను తమ్ముడని పిలుస్తున్న మోనాల్..?

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా.? అంటే మోనాల్ మాత్రమేనని చెప్పాలి.

అఖిల్, అభిజిత్ లతో ప్రేమాయణం వల్ల మోనాల్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

మోనాల్ వల్ల బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, అభిజిత్ బద్ధ శత్రువుల్లా ప్రవర్తించారు.ఇద్దరూ మోనాల్ నే ఇష్టపడుతూ ఉండటం వాళ్లిద్దరి మధ్య గొడవలకు కారణమైంది.

Monal Gajjar Gets Brother In Bigg Boss House Telugu Big Boss 4, Monal Gajjar, A

ప్రతి వారం నామినేషన్ సమయంలో అఖిల్, అభిజిత్ ఒకరినొకరు నామినేట్ చేసుకునేవారు.మరోవైపు రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా బిగ్ బాస్ మోనాల్ ను సేవ్ చేస్తున్నాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరో వారంలో మోనాల్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఆమెకు బదులుగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని.దసరా పండున రోజున కూడా మోనాల్ కు బదులుగా దివిని ఎలిమినేట్ చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

Advertisement

కొందరైతే మోనాల్ బిగ్ బాస్ దత్త పుత్రిక అంటూ కామెంట్లు చేస్తున్నారు.అఖిల్, అభిజిత్ లతో పాటు అవినాష్ తోనూ సన్నిహితంగా మెలుగుతున్న మోనాల్ ఒక కంటెస్టెంట్ ను మాత్రం తమ్ముడు అని పిలిచి వార్తల్లో నిలిచింది.

మార్నింగ్ మస్తీలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులలోని మంచి, చెడులను ప్రస్తావించాలని చెప్పగా తనకు, మెహబూబ్ కు కొన్ని గొడవలు ఉన్నాయని.ఆ చిన్నచిన్న గొడవలను పరిష్కరించుకోవడానికి అక్కగా కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలని చెప్పారు.

ఆ విధంగా మోనాల్ తనకు మెహబూబ్ తమ్ముడని చెప్పకనే చెప్పేశారు.మోనాల్ అలా చెప్పిన వెంటనే మెహబూబ్ స్పందిస్తూ థాంక్యూ అక్కయ్య అని అన్నారు.

మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ కు అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్ నామినేట్ కాగా మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు