Azad Movie:23 ఏళ్ల క్రితం నాగార్జున సినిమాలో ఇంత పెద్ద బ్లండర్ ఎలా జరిగింది ?

నాగార్జున హీరోగా సౌందర్య శిల్పా శెట్టి హీరోయిన్స్ గా 22 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఆజాద్.(Azad movie) ఈ చిత్రానికి దర్శకత్వ వహించింది తిరుపతి స్వామి అనే ఒక దర్శకుడు.

 Big Blunder In Nagarjuna Azad Movie-TeluguStop.com

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ రఘువరన్ వంటి వారు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.హీరోయిన్స్ హీరో మరియు మిగతా నటీనట్లంతా కూడా వారి వారి పాత్రల మేరకు బాగా మెప్పించడంతో ఈ సినిమా విజయంలో వారంతా కీలక పాత్ర పోషించారు.

ఇక ఈ చిత్రంలో నటించిన ప్రకాష్ రాజ్ మరియు రఘువరన్ వంటి వారు అద్భుతమైన నటనతో విజృంభించారనే చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు కేవలం మూడు నాలుగు సినిమాలకు అతి చిన్న వయసులో అంటే 32 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.

Telugu Azad, Bankimchandra, Nagarjuna, Prakash Raj, Raghuvaran, Thirupathisamy,

తిరుపతి స్వామి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంటుంది.ఆజాద్ సినిమాకి ముందు వెంకటేష్ నటించిన గణేష్ సినిమాకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించగా విభిన్నమైన చిత్రాలను తీసిన దర్శకుడిగా తిరుపతి స్వామి(Thirupathisamy) మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే అజాద్ సినిమా లో క్లైమాక్స్ సన్నివేషన్లో ప్రకాష్ రాజ్ మరియు రఘువరన్ మధ్య ఒక సన్నివేశం ఉంటుంది.ఈ సన్నివేశంలో భారత దేశంలో ముస్లింల యొక్క ప్రాధాన్యతల గురించి చెబుతూ వారికి మన ఇండియన్స్ ఎలా పెద్ద పీట వేస్తున్నారు అనే విషయాన్ని తనదైన రీతిలో చెప్తూ ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించాడు.

ఈ డైలాగ్స్ సినిమాకి చాలా కీలకమైనవి అని చెప్పొచ్చు.

Telugu Azad, Bankimchandra, Nagarjuna, Prakash Raj, Raghuvaran, Thirupathisamy,

ఇక ప్రకాష్ రాజ్ డైలాగు చెబుతూ చెబుతూ వందేమాతరం మేము ఎల్లప్పుడూ పాడుతూనే ఉంటాం.ఇది రాసిన వాడు ఒక ముసల్మాన్ అని చెప్తూ ఉంటాడు.అయితే వందేమాతరం రాసింది బంకించంద్ర చటర్జీ(Bankim Chandra Chatterjee) కదా ఆయన ఒక బ్రాహ్మణుడు పైగా బెంగాలీ.

మరి వందేమాతరం రాసింది ఒక ముస్లిం అంటూ ప్రకాష్ రాజ్ డైలాగు(Prakash Raj) చెబితే ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదు. సారే జహా సేఅచ్చా అనే గీతాన్ని రాసింది మాత్రం ఒక ముస్లిం.

అతడి పేరు మహమ్మద్ ఇక్బాల్.ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఈ విషయాన్ని ఎవరు గుర్తించకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube