ఎల్లారెడ్డిపేట ఆలయాల లో బోరుబావులు త్రవ్వకాలకు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపి ల్యాడ్స్ ద్వారా మంజూరు చేసిన నిధులతో ఎల్లారెడ్డిపేటలోని మడేలయ్య దేవాలయం ఆవరణలో, వేణుగోపాలస్వామి ఆలయ వ్యవసాయ భూమి లో బోరు వేసే కార్యక్రమాలకు బిజెపి నాయకులు భూమి చేశారు.

మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమములో మండల బిజెపి అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, పారిపల్లి సంజీవరెడ్డి ,పట్టణ అధ్యక్షుడు నంది నరేష్,బిపేట రమేష్, చందుపట్ల రామిరెడ్డి , వంగ శ్రీకాంత్ రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్, బుర్కా వేణు, దీటీ నరసయ్య ,కొన్న పోచయ్య , హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో నీటి సౌకర్యం కల్పించుటకు నిధులు మంజూరు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

Latest Rajanna Sircilla News