బాలయ్య, భూమిక ఏం కాంభినేషన్‌రా బాబోయ్‌ ఇది?

నందమూరి బాలకృష్ణ, కేఎస్‌ రవికుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ఆగస్టు రెండవ వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని నెలలు దాటిన నేపథ్యంలో సినిమా గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్‌ ప్రారంభం తేదీని ప్రకటించడంతో వాటికి ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.ఇక బాలయ్య సినిమా అంటే హీరోయిన్స్‌ గురించి పెద్ద చర్చ జరుగుతుంది.

స్టార్‌ హీరోయిన్స్‌ నుండి చిన్న హీరోయిన్స్‌ వరకు ప్రచారంలోకి వస్తారు.చివరకు ఎవరో ఒకరు ఎంపిక అవుతారు.

తాజాగా ఈ చిత్రంకు కూడా ఎంతో మంది హీరోయిన్స్‌ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.చివరకు సోనాల్‌ చౌహాన్‌ ఒక హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.బాలయ్య ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు.

Advertisement

ఒక పాత్రకు జోడీగా సోనాల్‌ చౌహాన్‌ నటించనుండగా, మరో పాత్రకు జోడీగా సీనియర్‌ హీరోయిన్‌ భూమికను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.భూమిక ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది.

ఆమె చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి.అయితే ఆమె కాలక్రమేనా సీనియర్‌ అవ్వడంతో హీరోయిన్స్‌గా ఆఫర్లు దక్కలేదు.

ఇక తాజాగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఈ అమ్మడు వరుసగా అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ వస్తోంది.

బాలయ్యతో ఈమెకు మంచి ఛాన్స్‌ అయితే దక్కింది.మరి దీన్ని ఆమె ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!
Advertisement

తాజా వార్తలు