ఆ నలుగురి చేతుల్లో తెలంగాణ నలిగిపోతున్నది.ఇందుకు కారణం కెసిఆరు వైఖరి అని టి.
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతీవ్రంగా విమర్శలు గుప్పించారు .ఆదివారం గాంధీ భవన్‌లో బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్ని విషయాలలో అండగా నిలిచింది.దళితులు ఎన్నో రంగాల్లో అభివృద్ధిదిశలో సాగారని , ఉన్నత పదవులు పొందారని తెలిపారు.
ఇప్పటి సర్కార్లు దళితులకు చేసింది సున్నా అని విమర్శించారు .బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా భూములు ఖరీదు చేసి దళితులకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.భట్టివిక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ నలుగురు మాత్రమే రాజ్యం ఏలుతున్నారని కెసిఆర్ సర్కార్లో ఉన్న కెసిఆర్ బంధువులను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించారు .కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా నియమితులైన షబ్బీర్ అలీని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క తదితరులు సన్మానించారు.నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పోలీసులకు టి.పిసిసి సంతాపం తెలిపింది.-







