నడిరోడ్డుపై మాజీ రౌడీషీటర్ పసుపులేటి రామకృష్ణ (55) ను దుండగులు దారుణంగా నరికి చంపారు.ఈ సంఘటన పట్టణంలో భీతావాహం కలిగించింది.
ఒకప్పుడు పేరుమోసిన రౌడీగా రామకృష్ణ అక్కడ జనాలకు తెలుసు.రానురాను ఎంతో మార్పురావడంతో పోలీసులు అతనిపై రౌడీషీట్ ఎత్తి వేశారు.
ఆ తర్వాత సెటిల్‌మెంట్లతో కాలం గడిపాడు .ఆదివారం తెల్లవారుఝామున దారుణ హత్యకు గురయ్యాడు.రామకృష్ణ బేతనీ పేటలోని డొంకిన వారి వీధిలో నివాసం ఉంటున్నాడు .ఆ నడిరోడ్డుపై అతి దారుణంగా హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు .వివరాలు సేకరించి హంతకుల కోసం గాలింపు ఉదృతం చేసారు అయితే చంపడంలో ఆరితేరిన వారే ఈ హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.రెండువర్గాల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసి ఉండవచ్చునని కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు.
పట్టణంలోని సంచలనం కలిగించిన పసుపులేటి హత్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.డాగ్ స్క్వాడ్స్ పట్టణంలో అడుగడుగునా గాలింపుచేపట్టాయి.త్వరలోనే ఈ హత్యకు పాల్పడిన వారిని పట్టుకుంటామని సిఐ కెనడి తెలిపారు
.






