రాజకీయాల్లో అదృష్టవంతులు లిస్టు తీస్తే అందులో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ( Vidadala Rajini ) పేరు కచ్చితంగా ఉంటుంది .కుటుంబానికి పెద్దగా రాజకీయ అనుభవం మరియు సామాజికంగా ఓట్ల దన్ను లేకపోయినా జగన్ వేవ్ ల్లో మాజీమంత్రి , దిగ్గజ నేత ప్రత్తిపాటి పుల్లారావు పై గెలిచిన విడుదల రజని అతి చిన్న వయసులోనే కీలకమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ దక్కించుకోగలిగారు .
జగన్ గుడ్ లుక్స్ లో ఉండడం తో మొదటి సారి ఎంఎల్ఏ అయినప్పటకి మంత్రి పదవి దక్కించుకున్నారు .అయితే మంత్రి పదవి వచ్చినప్పటినుంచి ఆమె వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఫిర్యాదులు అధిష్టానానికి వెళుతున్నా కూడా వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట టికెట్ తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు.

టిడిపి నుంచి మరోసారి ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తే తన గెలుపు నల్లేరుపై నడకే అని భావిస్తున్న ఆమెకు ఇప్పుడు కొత్త ప్రత్యర్థి ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది.పుల్లారావుతో విడుదల రజనీకి చెక్ పెట్టడం కష్టమని భావిస్తున్న టిడిపి అధిష్టానం భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ ను రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తుంది.భాష్యం ప్రవీణ్ కు తెలుగుదేశం కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.స్వతహా గ వ్యాపారవేత్త అయిన ఆయన నియోజకవర్గంలో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ నియోజకవర్గం లో చాలామందికి సుపరిచితుడు.
అంతేకాకుండా విడుదల రజనీ పై వస్తున్న అవినీతి ఆరోపణలు సొంత పార్టీలో ఆమెకు పెరుగుతున్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావిస్తున్న తెలుగుదేశం అధిష్టానం రజనీకి గట్టి పోటీగా భాష్యం ప్రవీణ్ ను భావిస్తుంది.

మరి సొంత పార్టీ నేతలు నుంచి వస్తున్న విమర్శలతో పాటు గట్టి ప్రత్యర్థి ని కూడా ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితుల్లో ఉన్న రజనీకి 2024 ఎన్నికలు( 2024 Elections ) అంతా సులభం కాదని , చేమటొ డచాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మరి ఆమే ఈ పరిస్తితి ని ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాలి.