హీరోలు సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు.. నటి షాకింగ్ కామెంట్స్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసి పెద్దగా పాపులారిటీని సొంతం చేసుకోని హీరోయిన్లలో భానుశ్రీ మెహ్రా( Bhanushree Mehra ) ఒకరు.వరుడు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు పడ్డారు.

 Bhanusree Mehra Shocking Post Goes Viral In Social Media Details Here , Bhanushr-TeluguStop.com

ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. వరుడు సినిమా( Varudu movie ) రిజల్ట్ వల్ల ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం సంకోచించారు.

అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్టులు పెడుతూ స్టార్ హీరోలు తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరోలను హీరోయిన్లను ఎందుకు వేరుగా చూస్తారంటూ ఆమె ప్రశ్నించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షాకింగ్ పోస్ట్ లు పెట్టారు.

సినిమా ఇండస్ట్రీలో వయస్సు పెరగడం( Increasing age ) అసలైన సమస్య అని ఆమె అన్నారు.హీరోయిన్లు వయస్సు పెరిగిన వెంటనే తల్లి పాత్రలకు పరిమితం కావాల్సిన పరిస్థితి ఇండస్ట్రీలో ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చారు.అదే సమయంలో హీరోలు మాత్రం వాళ్ల వయస్సులో సగం కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తున్నారని భానుశ్రీ మెహ్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.

వయస్సు పెరగడం వల్ల, పెళ్లి చేసుకోవడం వల్ల హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె కామెంట్లు చేశారు.హీరోయిన్లకు మాత్రమే ఎందుకు ఇలాంటి నిబంధనలని ఆమె ప్రశ్నించారు.ఈ ధోరణిని బ్రేక్ చేయాలని ధైర్యంగా బ్రతికే మహిళల కథలను చెప్పాలని భానుశ్రీ మెహ్రా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

భానుశ్రీ మెహ్రా చేసిన కామెంట్లపై ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube