ఆ సీనియర్ నటి జాతకం చెబితే జరిగి తీరాల్సిందే.. ఆమె ఎవరంటే?

ఒకప్పటి సీనియర్ భానుమతి రామకృష్ణ గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులు ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు.తాజాగా అనగా డిసెంబర్ 24న భానుమతి రామకృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలను మనం గుర్తు తెచ్చుకుందాం.1925 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించింది.తండ్రి స్ఫూర్తితోనే సాంప్రదాయ సంగీతాన్ని నృత్యాన్ని నేర్చుకుని,అపార సంగీత జ్ఞానాన్ని సంపాదించుకుంది.ఆ తర్వాత 1939లో మొదటిసారిగా వరవిక్రయం అనే సినిమాలో నటించి మెప్పించింది.ఆ తర్వాత వచ్చిన కృష్ణప్రియ, స్వర్గసీమ ఇలాంటి సినిమాలు ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి.

 Bhanumathi Ramakrishna Death Anniversary Special Details, Bhanumathi Rama Krishn-TeluguStop.com

ఆ తర్వాత ఈమె తన కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

భానుమతి రామకృష్ణ కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, దర్శకురాలిగా,నిర్మాతగా, రచయితగా,సంగీత దర్శకురాలిగా,స్టూడియో యజమానురాగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో గుర్తింపు భానుమతి.అప్పట్లో హీరోలకు సమానంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పే నైజాన్ని కలిగి ఉండడంతో ఆమెను చూసి చాలా మంది పొగరు అని కూడా అనుకునేవారు.ఆమె మాత్రం అటువంటి మాటలకు చలించిపోయేది కాదు.

Telugu Bhanumathirama, Anniversary, Senioractress, Tollywood-Movie

కాగా భానుమతి 1943 ఆగస్టు 8న తమిళ సినిమా నిర్మాత డైరెక్టర్ అయిన పిఎస్ రామకృష్ణారావును పెళ్లి చేసుకున్న తర్వాత భానుమతి రామకృష్ణగా మారింది.ఈమెకు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలలో కూడా మంచి అనుభవం ఉంది.దాంతో ఆమె ఏది చెప్పినా కూడా కచ్చితంగా జరిగేది.ఎంజీఆర్ వంటి నటుడికి రాజా పరిపాలనయోగం ఉంది అని అతను ముఖ్యమంత్రి కావడానికి 20 ఏళ్ల ముందే ఒక షూటింగ్ వినామ సమయంలో చేతి రేఖలు చూసి చెప్పింది భానుమతి రామకృష్ణ.

అదే విషయాన్ని భానుమతి మర్చిపోయిన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంజీఆర్ అదే విషయాన్ని భానుమతికి గుర్తు చేశారు.ఆ విధంగా అప్పట్లో ఆమె సాముద్రిక శాస్త్రాలలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉండేది.

అంతేకాకుండా ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి అన్నదానికి ఎంజీఆర్ ది చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube