భానుమతి. ఈ పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది.
ఎందుకంటే ఇక నటిగా దర్శకురాలిగా అంత గొప్ప గుర్తింపు సంపాదించుకున్నారు ఆమె.వందల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా హవా నడిపించారు.ఏకంగా హీరోలను తలదన్నే క్రేజ్ తో తనకు తిరుగు లేదు అని నిరూపించారు.ఇక అప్పట్లో భానుమతినీ తమ సినిమాల్లో పెట్టుకుంటే చాలు ఇక సినిమా విజయం సాధిస్తుంది అని దర్శక నిర్మాతలు నమ్మేవారు.
అందుకే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె డేట్స్ కోసం ఎన్ని రోజులైనా వేచి చూస్తూ ఉండేవారు దర్శకనిర్మాతలు.అయితే ఇక గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న భానుమతికి కాస్త గర్వం ఎక్కువ అనే ముద్ర కూడా పడిపోయింది.
దీనికి ఆమె తీరే కారణం అని అంటూ ఉంటారు.ఎందుకంటే సాధారణంగా హీరో లతో పోల్చి చూస్తే హీరోయిన్ ల రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటుంది.
కానీ భానుమతి మాత్రం ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి సినిమాల్లో నటిస్తున్న వారి కంటే ఒక్క రూపాయి ఎక్కువగానే తన రెమ్యూనరేషన్ ఉండాలని డిమాండ్ చేస్తూ ఉండేది.అందుకే ఇక భానుమతి గర్వం కాదు ఆత్మాభిమానం అని చెబుతూ ఉంటారు ఎంతో మంది సినీ ప్రముఖులు.
ఇక వందల చిత్రాల్లో నటించిన భానుమతి కేవలం నటిగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో కూడా ప్రేక్షకులను అలరించారు.దర్శకురాలిగా కూడా ప్రతిభతో ఎంతగానో మెప్పుపొందారు ఆమె.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా ప్రస్థానాన్ని కొనసాగించిన భానుమతి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణ ను ప్రేమించి మరీ పట్టుబట్టి పెళ్లి చేసుకుంది.
ఇక భానుమతి రామకృష్ణ దాంపత్య బంధానికి గుర్తుగా భరణి అనే కొడుకు కూడా జన్మించాడు.ఇక ఇప్పుడు భానుమతి కొడుకు భరణి డాక్టర్ గా సెటిల్ అయ్యాడు.అయితే భానుమతి మధ్య వయసులో ఉన్నప్పుడు రామకృష్ణ కాలం చేశారు.
కొడుకు అమెరికాలో ఉండడంతో మంచి చెడులు చూసుకునేందుకు భానుమతికి ఎవరూ లేకుండా పోయారు.మధుమేహ వ్యాధి కారణంగా బాగా లావు అయిన భానుమతి తన పనులు తాను చేసుకోలేని పరిస్థితికి వచ్చింది.
ఇక చుట్టూ ఎంతో మంది పనిమనుషులు ఉన్నా నా అన్నవాళ్లు లేకుండా పోయారు.చివరికి చెన్నైలో లంకంత ఇంటిలో 80 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు.
దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి లో మునిగిపోయింది.