తమిళ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు హీరో విక్రమ్.స్టార్ హీరోలందరూ కమర్షియల్ సినిమాల వెంట పరుగులు పెడుతూ ఉంటే హీరో విక్రమ్ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల వెంట పరుగులు పెడుతున్నాడు.
కెరీర్ మొదటి నుంచి ఇక ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా విక్రమ్ ఎప్పుడు విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను అలరించాడు.ఇక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది పక్కన పెట్టి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు విక్రమ్.
ఇక కోలీవుడ్ లో కమల్ హాసన్ తర్వాత ఆ రెంజ్ లో ప్రయోగాలు చేసేది విక్రమ్ అని చెబుతూ ఉంటారు అందరూ.ఇకపోతే విక్రమ్ గురించి దాదాపు అందరికీ తెలుసు కానీ.
విక్రమ్ ఫ్యామిలీ లో ఎంతోమంది నటీనటులు ఉన్నారు అన్న విషయంకొంతమందికి మాత్రమే తెలుసు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విక్రం అసలు పేరు కెనడీ జాన్ విక్టర్ అయితే విక్రమ్ తండ్రి కూడా యాక్టర్ కావడం గమనార్హం.అయినప్పటికీ తండ్రి పేరు చెప్పుకొని కాకుండా సొంతంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విక్రమ్ఇక వినోద్ రాజా అనే పేరు మీద విక్రమ్ తండ్రి తమిళ సినిమాల్లో నటించారు.

ప్రముఖ దర్శక నటుడు త్యాగరాజన్ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విక్రమ్ తండ్రి.ఆమె సబ్ కలెక్టర్గా పనిచేసేవారు. త్యాగరాజన్ కొడుకు ప్రశాంత్ జోడి, జీన్స్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ప్రశాంత్ స్వయంగా విక్రమ్ కి బావమరిది అవుతాడు.అయితే కొడుకును సినిమా రంగం వైపు వెళ్ళొద్దని సూచించినప్పటికీ అటు విక్రమ్ సినిమా ఇండస్ట్రీపై ఇష్టంతో ఇంట్లో నుంచి పారిపోయి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగాడు.ఇక ఇప్పుడు విక్రమ్ కొడుకు దృవ్ కూడా సినిమాలో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక విక్రమ్ బావమరిది ప్రశాంత్ వాళ్ళ అమ్మమ్మ అలనాటి నటి జయంతి కావడం గమనార్హం.ఇలా విక్రమ్ ఫ్యామిలీ లో ఎంతోమంది నటీనటులు ఉన్నారు.