మీరు ఎన్నో రకాల వేడుకలకు హాజరై ఉంటారు.పెళ్లి, పుట్టినరోజు, నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొని ఉంటారు.
కానీ ఎప్పుడైనా విడాకుల వేడుకకు వెళ్లారా? మీ సమాధానం లేదని వస్తుంది.ఎందుకంటే అలాంటి వేడుకలు అస్సలు ఎవరూ నిర్వహించుకోరు.
కానీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తొలిసారిగా ‘విడాకుల వేడుక’ నిర్వహిస్తున్నారు.భాయ్ వెవ్ఫేర్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇందుకోసం పెళ్లి ఆహ్వాన పత్రికల తరహాలో ఆహ్వాన పత్రికలను రూపొందించి పంపిణీ చేశారు.ఇప్పుడు ఈ విడాకుల ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భాయ్ వెల్ఫేర్ సొసైటీ అనేది మధ్యప్రదేశ్ లో ఓ ఎన్టీవో సంస్థ.ఇది భార్య బాధితులకు అండగా నిలుస్తోంది.
తాజాగా ఈ సంస్థ కొత్తగా విడాకులు తీసుకున్న 18 మంది మగాళ్ల తరపున విడాకుల సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ నిర్ణయం తీసుకుంది.అంతేకాక, ఈ వేడుక తరపున ఆహ్వాన పత్రిక తయారు చేయించి అందులో వేడుక వివరాలను పేర్కొంది.
సెప్టెంబర్ 18న జరగనున్న ఈ విడాకుల వేడుక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.
పెళ్లి సమయంలో ఎలాంటి ఆచారాలు జరుగుతాయో.అందుకు విరుద్ధంగా జరిగే ఆచారాలు ఈ వేడుకలో జరగనున్నాయి.
జెంట్స్ మ్యూజిక్, జయమాల ఇమ్మర్షన్, ఊరేగింపు రిటర్న్ మొదలైనవి.ఇవి మాత్రమే కాదు.
ప్రోగ్రామ్ కి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి పురుషుల హెల్ప్ లైన్ నంబర్ కూడా జారీ చేశారు.అది కార్డులోనే ముంద్రించారు.

భార్యల ద్వారా వేధింపులు ఎదుర్కొన్న పురుషులు ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించి.తమ పాత జీవితం నుంచి బయటకు రావాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జకీ అహ్మద్ వివరించారు.ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.అయితే ఎక్కువ మంది పాజిటివ్ గా స్పందించడం విశేషం.
కాగా, జాతీయ నేర గణాంక శాఖ నివేదిక ప్రకారం.
ఇండియాలో ఏడాదికి కోటి వివాహాలు జరుతున్నాయి.వాటిలో 90 శాతం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు.
వీటిలో 80 శాతం హిందూ వివాహాలు ఉన్నాయి.అయితే పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంటున్న జంటలు 13.6 లక్షలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.ముఖ్యంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతుందట.
ఇక విడాకుల కేసులు కూడా ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయట.







