యూఎస్ లో 1 మిలియన్ మైల్ స్టోన్ టచ్ చేసిన 'భగవంత్ కేసరి'!

నందమూరి నటసింహం బాలకృష్ణ గత రెండు మూడు సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.

అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలయ్య ఏది చేసిన తిరుగుండడం లేదు.

అఖండ తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి మరో హిట్ అందుకున్నాడు బాలయ్య.ఇక ఇప్పుడు దసరా పండుగను కూడా కబ్జా చేసి తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ భగవంత్ కేసరి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈయనతో బాలయ్య చేతులు కలిపినప్పుడే బ్లాక్ బస్టర్ అని అంతా భావించారు.

Advertisement

ఎందుకంటే అనిల్ రావిపూడి ఇంత వరకు ఒక్క ప్లాప్ కూడా అందుకోలేదు.అనుకున్నట్టుగానే అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా రావడంతో కలెక్షన్స్ రోజురోజుకూ మరింత పుంజుకుంటున్నాయి.

కేవలం మూడు రోజుల్లోనే బాలయ్య 70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసాడు.అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా ఎప్పుడు లేని విధంగా భగవంత్ కేసరితో బాలయ్య సంచలనాలు సృష్టిస్తున్నాడు.

ఈ సినిమా అక్కడ తాజాగా రికార్డ్ మైల్ స్టోన్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసిందని మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.ఇక ఈ రోజు రేపు సెలవు దినాలు కావడం మరింత ప్లస్ అయ్యేలా ఉంది.లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబదుటఁదో చూడాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల,( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Arjun Rampal ) నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు