అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా.. అయితే అవిసె గింజలతో చెక్ పెట్టండిలా!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనలో చాలా మంది అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు.

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

అయితే అందరిలోనూ హెయిర్ ఫాల్ కు కారణాలు ఒకేలా ఉండవు.కారణం ఏదైనా సరే హెయిర్ ఫాల్ సమస్యకు చెక్‌ పెట్టడానికి అవిసె గింజలు( Flax seeds ) అద్భుతంగా సహాయపడతాయి.

సరైన పద్ధతిలో వీటిని వాడితే జుట్టు ఎంత అధికంగా రాలుతున్న సరే దెబ్బకు కంట్రోల్ అవుతుంది.మరి ఇంతకీ అవిసె గింజలను ఎలా వాడాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసుకోవాలి.అలాగే రెండు మందార పువ్వులను వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలు, మందారం పువ్వులను వాటర్ తో సహా వేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకే ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్( Hair fall ) ఎంత తీవ్రంగా ఉన్నా చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల సహజంగానే కురులు సిల్కీగా మార‌తాయి.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటివి సైతం తగ్గుతాయి.

కాబట్టి హెయిర్ ఫాల్ తో బెంగ పెట్టుకున్న వారు తప్పకుండా ఈ అవిసె గింజల ప్యాక్ ను ట్రై చేయండి.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు