ప్రస్తుతం భారత మార్కెట్లో 5G ఫోన్ల హవా నడుస్తోంది.ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు తక్కువ బడ్జెట్ లోనే 5G ఫోన్లను( 5G Mobiles ) మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
లాంచింగ్ సమయంలో 5G ఫోన్ల ధర కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ క్రమేనా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.రూ.15 వేల బడ్జెట్ లో అందుబాటులో ఉండే 5G ఫోన్లు ఏవో చూద్దాం.
రియల్ మీ 11ఎక్స్:
ఈ ఫోన్( Realme 11x 5G ) ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో పాటు 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది.ఈ ఫోన్ 6GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్ ధర రూ.14999 గా ఉంది.

మోటో జీ 62 5G:
ఈ ఫోన్( Motorola G62 5G ) ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో ఉంటుంది.5000mAh బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం కలిగి ఉంది.ఈ ఫోన్ 8GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్ ధర విషయానికి వస్తే రూ.14999కు అందుబాటులో ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ ధర రూ.13999 గా ఉంది.

వివో టీ 2ఎక్స్ 5G:
ఈ ఫోన్( Vivo T2x 5G ) ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ 6GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13999 గా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ల తో పాటు రెడ్ మీ 12 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM వెర్షన్ ధర రూ.11999 గా ఉంది.పోకో ఎమ్ 6 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM వెర్షన్ ధర రూ.10999 గా ఉంది.







