Indigestion : నిత్యం అజీర్తితో బాధపడుతున్నారా.. మందులతో పని లేకుండా ఇలా పరిష్కరించుకోండి!

అజీర్తి( Indigestion ).అత్యంత సర్వసాధారణంగా వేధించే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.

తిన్న ఆహారం జీర్ణం కాకపోవడాన్నే అజీర్తి లేదా అజీర్ణం అని అంటారు.ఎప్పుడో ఒకసారి తలెత్తే అజీర్తి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కానీ కొందరు నిత్యం అజీర్తితో బాధపడుతుంటారు.అజీర్తి వల్ల కడుపు మొత్తం ఉబ్బరంగా ఉంటుంది.

ఛాతి, గుండెలో మంటగా అనిపిస్తుంది.అలాంటి సమయంలో డైజెషన్ ట్యాబ్లెట్స్‌, సోడాలు తాగుతుంటారు.

Advertisement

ఇవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనాన్ని అందిస్తాయి.శాశ్వత పరిష్కారాన్ని అందించలేవు.

అయితే మందులతో పని లేకుండా అజీర్తిని శాశ్వతంగా పరిష్కరించడానికి కొన్ని ఇంటి చిట్కాలు తోడ్పడతాయి.అందులో ఒక ఉత్తమ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అర అంగుళం అల్లం ముక్క తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా క‌డిగి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు ( Fennel seeds )వేసుకోవాలి.

అలాగే అల్లం తురుము కూడా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ప్రతిరోజు ఉదయాన్నే ఈ డ్రింక్ ను తీసుకోవాలి.జీర్ణ వ్యవస్థ( Digestive system ) పనితీరును మెరుగుపరచడానికి ఈ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

Advertisement

నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే అజీర్తి అన్న మాటే అనరు.పైగా గ్యాస్, కడుపు ఉబ్బరం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి ఇతర జీర్ణ సమస్యలకు సైతం ఈ డ్రింక్ చెక్ పెడుతుంది.

ఇక అజీర్తి కి దూరంగా ఉండాలంటే ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా టైమ్‌ టు టైమ్‌ ఫుడ్ ను తీసుకోవాలి.

అలాగే స్పైసీ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ ను వీలైనంత వరకు దూరం పెట్టాలి.కొందరు ఆహారాన్ని ఒకేసారి అధిక మొత్తంగా తీసుకుంటారు.

అజీర్తికి ఇది కూడా ఒక కారణమే.కాబట్టి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఫుడ్ ను తీసుకోండి.

కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌ వంటి కెఫిన్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే అజీర్తికి దారితీస్తుంది.అందువ‌ల్ల ఇటువంటి డ్రింక్స్ ను ఎవైడ్ చేయ‌డం చాలా ఉత్త‌మం.

తాజా వార్తలు