తప్పుకున్న శాండర్స్...డెమోక్రటిక్ అభ్యర్ధిగా జో బిడెన్..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ధాటికి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు.లక్షలాది మంది ప్రజలు కరోనా సోకి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.

ఈ ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ట్రంప్ మాత్రం నవంబర్ లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేదని యాదావిదిగా ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.ఈ క్రమంలోనే డెమోక్రటి పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఎవరు నిలుస్తారు అనే ఉత్కంటకి తెరపడింది.

ఎంతో మంది డెమోక్రటిక్ పార్టీ నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడగా వారిలో బెర్నీ శాండర్స్, జో బిడెన్ తుది పోరులో నిలిచారు.అయితే అనూహ్యంగా అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన జో బిడెన్ కి ప్రజా మద్దతు ఉండటంతో శాండర్స్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచీ తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.

జో బిడెన్ అధ్యక్ష రోసులో ఉండటానికి అర్హుడిగా నేను ఒప్పుకుంటున్నాను అంటూ శాండర్స్ తన ప్రసంగాని వినిపించాడు.

Advertisement

జో బిడెన్ భవిష్యత్తులో అధ్యక్ష అభ్యర్ధిగా డెమోక్రటిక్ పార్టీ తరపున నామినేషన్ వేస్తారు, భవిష్యత్తులో ఇద్దరం కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటి వరకూ నాకు మద్దతుగా నిలిచినా ప్రజలకి కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు.అలాగే ప్రచారం కోసం సాయం అందించిన 20 లక్షల మంది అమెరికన్ ప్రజలకి నేను ఎప్పటికి ఋణపడి ఉంటానని ప్రకటించారు.

ఇదిలాఉంటే శాండర్స్ నిష్క్రమణతో అమెరికా రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి.అయితే అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరిగే అవకాశాలు లేవని వాయిదా పడతాయని అంటున్నారు పరిశీలకులు.

Advertisement

తాజా వార్తలు