బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాజీ క్రికెటర్ కి బంపర్ ఆఫర్..!!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఎన్నికలలో బిజెపి పార్టీతో హోరాహోరీగా జరిగిన పోరులో మమతా సాధించిన విజయం దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది.

ఇదిలావుంటే ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీ ఎన్నికలలో గెలిచిన కొత్తవారికి అవకాశం కల్పిస్తూ మంత్రివర్గంలో తీసుకుంటూ ఉంది.దీనిలో భాగంగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కి క్రీడా శాఖ మంత్రిత్వ శాఖను అప్పగించారు.

ఈ సందర్భంగా తన జీవితంలో కొత్త ప్రయాణం స్టార్ట్ అయ్యింది అని మనోజ్ తివారీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.అంత మాత్రమే కాక ప్రమాణ స్వీకారం ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని, తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం కచ్చితంగా వృధా కాకుండా సేవ చేస్తాను అంటూ మమతా బెనర్జీ కి అదేవిధంగా సోదరుడు అభిషేక్ కి కృతజ్ఞతలు తెలిపారు.

మనోజ్ తివారి ఇండియా దేశం తరఫున 12 వన్డే మ్యాచ్ లు,  3 టీ20లు ఆడాడు.అంతేకాకుండా ఐపీఎల్ ట్రోఫీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో అప్పట్లో మ్యాచ్ లు కూడా ఆడటం జరిగింది.

Advertisement
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు