మొటిమలు, మచ్చలను పోగొట్టే బిళ్ళ గన్నేరు..ఎలా వాడాలంటే?

ప‌ల్లెటూర్ల‌లో ఎక్క‌డి ప‌డితే అక్క‌డ బిళ్ళ గన్నేరు మొక్క‌లు కనిపిస్తుంటాయి.ఈ మొక్క సంవత్సరమంత‌టా పూలు పూస్తుంది.

ఆ పూల‌ను దేవుడి అల‌క‌ర‌ణ‌కు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటుంది.అయితే చాలా మందికి ఈ మొక్క యొక్క ప్ర‌యోజ‌నాల గురించి తెలియ‌దు.

నిజానికి బిళ్ళ గన్నేరు మొక్క పూలు, ఆకులు దగ్గర నుండి వేర్ల వరకు అన్నిట్లోనూ ఎన్నో ఔష‌ధ‌ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే బిళ్ల గ‌న్నేరు మొక్క అనేక జ‌బ్బుల‌ను నివారించ‌గ‌ల‌దు.

అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సంర‌క్ష‌ణ‌కు కూడా బిళ్ళ గ‌న్నేరు మొక్క ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను మాటుమాయం చేసి.

Advertisement

చ‌ర్మాన్ని కాంతివంతంగా మెరిపించ‌డంలో బిళ్ళ గ‌న్నేరు మొక్క గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి చ‌ర్మానికి బిళ్ళ గ‌న్నేరును ఎలా యూజ్ చేయాలి.? అన్న విష‌యాన్ని ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బిళ్ళ గ‌న్నేరు మొక్క యొక్క ఆకుల‌ను తీసుకుని ఎండ‌లో ఎండ బెట్టి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్ బిళ్ళ గ‌న్నేరు ఆకుల పొడి, ఒక‌ స్పూన్ వేపాకు ర‌సం మ‌రియు చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖంపై పూసి.

ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే.మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి ముఖం కాంతి వంతంగా మారుతుంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇక తెల్ల జుట్టును నివారించ‌డంలోనూ బిళ్ళ గ‌న్నేరు ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.ముందుగా బిళ్ళ గ‌న్నేరు ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక స్పూన్ నిమ్మ ర‌సం మ‌రియు రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసుకుని క‌లిపి.జుట్టు మొత్తానికి ప‌ట్టించాలి.

అర గంట త‌ర్వాత హెడ్ బాత్ చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్లబ‌డుతుంది.

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

తాజా వార్తలు