విదేశీ ఉద్యోగులకు బెల్జియం షాక్ : ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు, మే 1 నుంచి అమల్లోకి

యూరప్‌లోని బెల్జియం( Belgium ) విదేశీ ఉద్యోగుల విషయంలో ఇమ్మిగ్రేషన్ పాలసీలో భారీ మార్పులను ప్రకటించింది.మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

 Belgium Announces Major Changes To Immigration Policy For Foreign Workers, Effec-TeluguStop.com

బెల్జియంలోని ఫ్లాన్డర్స్ రీజియన్ తన ఇమ్మిగ్రేషన్ పాలసీలో .ముఖ్యంగా విదేశీ కార్యికులకు సంబంధించి గణనీయమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధమైంది.ఈ మార్పుల ప్రకారం బెల్జియన్, యూరోపియన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.స్థానిక, ప్రాంతీయ లేబర్ మార్కెట్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే విదేశీ పౌరులను వర్క్‌ఫోర్స్‌లోకి అనుమతించడం జరుగుతుంది.

పునరుద్ధరించబడిన విధానాలు కార్మిక వలసల ప్రభుత్వ కేంద్రీకృత నమూనాను సమర్ధించడం లక్ష్యంగాపెట్టుకున్నాయి.ముఖ్యమైన సర్దుబాట్లలో వర్క్ పర్మిట్ మినహాయింపులకు విస్తరణలు, ఉపాధి, లేబర్ మార్కెట్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్‌లపై పరిమితులు, ఈయూ బ్లూ కార్డ్ హోల్డర్‌లు, ఇంట్రా కంపెనీ బదిలీదారుల కోసం సడలించిన విద్యా అర్హతలు, ఇతర అవసరాలు వున్నాయి.

మార్పులలోని ముఖ్యమైన అంశం వర్క్ పర్మిట్( Work permit ) మినహాయింపులను విస్తృతం చేయడం.

Telugu Belgium, Europe, Foreign, Policy, Vdab, Permit, Workce-Telugu NRI

ఇది వర్క్ పర్మిట్ అవసరం లేకుండా బిజినెస్ టూరిస్టుల( Business Tourist ) హోదాలో సమావేశాలలో పాల్గొనడం, వ్యాపార ఒప్పందాల చర్చలు, పర్యాటక సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనడం వంటి వివిధ కార్యకలాపాలను అనుమతిస్తుంది.ఏదిఏమైనప్పటికీ.యజమానులు తప్పనిసరిగా బెల్జియంలో తమ ఉద్యోగుల బస వ్యవధిని పర్యవేక్షించాలి.180 రోజుల వ్యవధిలో 90 రోజులకు మించకూడదని నిర్దేశించిన నియమానికి అనుగుణంగా వుండేలా చూసుకోవాలి.

Telugu Belgium, Europe, Foreign, Policy, Vdab, Permit, Workce-Telugu NRI

మీడియం స్కిల్డ్ కొరత వృత్తుల కోసం వ్యక్తులను నియమించాలనుకునే యజమానులు ఇకపై దరఖాస్తుదారుల నైపుణ్యాలు, అనుభవం , అర్హతల డాక్యుమెంటేషన్‌ను తప్పనిసరిగా అందించాలి.వీటిని ప్రాంతీయ ఉపాధి మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.ఈ అదనపు అవసరం అంతర్గత పరిపాలనా ప్రక్రియను పొడిగించవచ్చని భావిస్తున్నారు.

లేబర్ మార్కెట్ పరీక్ష ప్రక్రియ కూడా కఠినమైన నియమాలను తీసుకురానుంది.ఇప్పుడు ఉద్యోగ ఖాళీలను దరఖాస్తుకు ముందు నాలుగు నెలలలోపు కనీసం 9 వారాల పాటు ప్రచురించాల్సిన అవసరం వుంది.

ఉద్యోగ పోస్టింగ్‌లు తప్పనిసరిగా EURES , VDAB వెబ్‌సైట్‌లలో కనిపిస్తాయి.VDAB ద్వారా కొరత వృత్తులుగా జాబితా చేయబడిన ఉద్యోగాల కోసం లేబర్ మార్కెట్ పరీక్ష దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తుంది.

ఇది విదేశీ కార్మికులకు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube