బిక్షం ఎత్తి 6.61 లక్షల సంపాదించింది.. ఆ మొత్తం పుల్వామా అమరులకు విరాళం

లక్షలు కోట్లు సంపాదిస్తున్న వారు పుల్వామా ఉగ్ర దాడిలో మృతి చెందిన అమర వీరులకు వందల్లో సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు.అమర జవాన్‌ల కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్కువ శాతం మంది కూడా తమ వంతు సాయం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

కాని ఎండనకా వాన అనగా ఒక గుడి ముందు బిక్షం ఎత్తిన ఒక వృద్ద మహిళ తాను బిక్షం ఎత్తి పోగు చేసిన 6.61 లక్షల రూపాయలను పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్‌లకు విరాళంగా ఇవ్వడం జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన నందినీ శర్మ చాలా ఏళ్లుగా బిక్షం ఎత్తుకుని జీవనం సాగిస్తుంది.ఆమెకు పిల్లలు లేరు.

ఒంటరి జీవితం.అయినా కూడా ఆమె వచ్చిన ప్రతి పైసాను బ్యాంకులో జమ చేసింది.

ఆ డబ్బుకు తెలిసిన వారు ఇద్దరిని నామినీలుగా పెట్టింది.తన తర్వాత ఆ డబ్బును దేశ ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కోరింది.

Advertisement

నందినీ శర్మ గత ఆగస్టులో మృతి చెందింది.ఆమె దాచి పెట్టిన డబ్బును సరైన సమయంలో ఖర్చు చేసేందుకు నామినీలు ఇద్దరు ఎదురు చూశారు.

తాజాగా వారిద్దరికి పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్‌లకు ఆ డబ్బు ఇస్తే బాగుంటుందని, నందినీ శర్మ ఆత్మ కూడా సంతోషిస్తుందని భావించారు.

తాజాగా ఉన్నతాధికారులను కలిసిన వారిద్దరు నందినీ శర్మ పేరుతో 6.61 లక్షల మొత్తంను పుల్వామా దాడిలో చనిపోయిన వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది.పుల్వామా దాడిలో చనిపోయిన వీర జవాన్‌లకు పెద్ద ఎత్తున విరాళం ఇచ్చినందుకు నందినీ శర్మ మరియు ఆమె నామినీలను దేశ వ్యాప్తంగా ప్రజలు అభినందిస్తున్నారు.

పెద్ద ఎత్తున సాయం చేయాలంటూ విజ్ఞప్తులు వస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.కాని నందినీ శర్మ మాత్రం ముందే తన మరణం తర్వాత డబ్బును దేశం కోసం ఖర్చు చేయాలని చెప్పి గొప్ప పని చేసింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు