ఆన్ లైన్ యాప్ ట్రాన్సాక్షన్స్, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డు డేటాను ప్రత్యేకమైన టోకెన్ లతో భర్తీ చేయడానికి టోకనైజేషన్ సిస్టమ్స్ ని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది.సెప్టెంబర్ 30, 2022 నాటికి డెబిట్, క్రెడిట్ కార్డు డేటాను టోకెన్లతో భర్తీ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
టోకనైజేషన్ సిస్టమ్ సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడం ద్వారా కార్డు హోల్డర్లకు చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.కస్టమర్ల ట్రాన్సాక్షన్ ప్రక్రియను సులభతరం చేయడానికి వారి కార్డు వివరాలు ‘ఎన్ క్రిప్టెడ్ టోకెన్’ గా స్టోర్ చేయబడతాయి.
టోకనైజేషన్ అంటే ఏంటీ?RBI ప్రకారం, టోకనైజేషన్ అనేది అసలు కార్డ్ వివరాలను ప్రత్యామ్నాయంగా ‘టోకెన్’ అని పిలిచే ఒక ప్రత్యామ్నాయ కోడ్‌తో భర్తీ చేస్తుంది.ఇది కార్డ్, టోకెన్ రిక్వెస్టర్ మరియు డివైజ్ కలయిక కోసం ప్రత్యేకంగా ఉంటుంది.
ఇక్కడ రిక్వెస్టర్ అంటే తమ కార్డును టోకనైజ్ చేయమని కస్టమర్ నుంచి వచ్చిన అభ్యర్థనను అంగీకరించి, ఆపై సంబంధిత టోకెన్ ను జారీ చేయడానికి కార్డ్ నెట్ వర్క్ కు పంపే సంస్థ.
ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బయటకు తెలియకుండా పేమెంట్స్ జరుపుతాయి.
ఒరిజనల్ కార్డ్ డేటాను ఎన్ క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయడానిక ఆర్బీఐ తప్పనిసరి చేసింది.టోకనైజేషన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ సురక్షితంగా ఉంటాయి.
ఇది కార్డ్ హోల్డర్ల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ని మెరుగుపరుస్తుంది.అంతేకాదు.
ఆన్ లైన్ మోసాలగాళ్ల నుంచి సమాచారాన్ని భద్రపరుస్తుంది.ఈ టోకనైజేషన్ అనేది పూర్తిగా ఉచితం.
దేశీయ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.కార్డు టోకనైజ్ చేసుకోవడానికి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు పెట్టింది.
టోకెన్లను ఎలా రూపొందించాలి? స్టెప్ 1: ఏదైనా కొనుగోలు చేయడానికి, పేమెంట్స్ ట్రాన్సాక్షన్ కోసం ఇ-కామర్స్ వెబ్ సైట్ లేదా యాప్ లో వెళ్లాలి.స్టెప్ 2: మీ కార్డును ఎంచుకోవాలి.చెక్ అవుట్ చేస్తున్నప్పుడు మీ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, ఏదైనా అదనపు సమాచారాన్ని నమోదు చేయాలి.స్టెప్ 3: ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మీ కార్డును టైకనైజ్ చేయాలి.దీని కోసం ‘సెక్యూర్ యువర్ కార్డ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.స్టెప్ 4: టోకెన్ క్రియేట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి.ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి మీ మొబైల్ ఫోన్ లేదా ఈమెయిల్ లో బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 5: ఇప్పుడు టోకెన్ క్రియేట్ అవుతుంది.మీ కార్డు డేటా ఇప్పుడు ఈ టోకెన్ తో భర్తీ అవుతుంది.స్టెప్ 6: ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీ కార్డును గుర్తించేందుకు, మీరు వెబ్ సైట్ లేదా యాప్ లోకి వెళ్లినప్పుడు మీ కార్డులోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.అంటే మీ కార్డు టోకనైజ్ అయ్యిందని అర్థం.







