అంబేద్కర్ కోనసీమ జిల్లా అంకపాలెంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల్లో విషాదం నెలకొంది.వన భోజనాల్లో పాల్గొన్న సుమారు 25 మంది మహిళలపై తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.
తేనేటీగల దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో పది మంది మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.