గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరంతా టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.దీంతో బీజేపీ హైకమాండ్ క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలకు ఉపక్రమించింది.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్ డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారని సమాచారం.కాగా వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.