ఎన్టీఆర్ 30 కోసం భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ.. ఏకంగా అన్ని కోట్లా?

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

 Beauty Is Demanding Heavily For Ntr 30 All The Crores At Once Ntr, Rashmika, Nt-TeluguStop.com

ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దీంతో ఎన్టీఆర్ పాపులారిటీ ప్రపంచమంతా వ్యాపించింది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 సినిమా రానుంది.ఈ సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కావటం లేదు.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ప్లాప్ అవటంతో కొంతకాలం ఈ సినిమాకు బ్రేక్ పడింది.

తర్వాత కొరటాల శివ కథలో కొంతవరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఎన్టీఆర్ 30 సినిమా హీరోయిన్ విషయంలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.మొదట ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాహ్నవి కపూర్ నటిస్తుందని వార్తలు వినిపించాయి.

Telugu Koratala Shiva, Ntr, Pushpa, Rashmika, Tollywood-Movie

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాలో నటించిన ఆలియా భట్ ఎన్టీఆర్ కి జోడిగా తన 30వ సినిమాలో నటించనుందని వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఇటీవల సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అవకాశం దక్కించుకుందని రూమర్లు వినిపించాయి.ఇక తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియన్ హీరోగా గుర్తింపు పొందిన రష్మిక ఎన్టీఆర్ 30 సినిమాలో నటించడానికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రష్మిక ఐదు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా… కొరటాల శివ అందుకు అంగీకరించినట్లు సమాచారం.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube