కర్బూజతో ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కైనా చెక్ పెట్టండిలా!

క‌ర్బూజ పండు.ఎంత రుచిగా ఉంటుందో అంతే స్థాయిలో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, కాల్షియం, ఫాస్పరస్, ఐర‌న్‌, పొటాషియం, సోడియం, విట‌మిన్ సి, విటమిన్ ఏ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉండే క‌ర్బూజ పండును తిన‌డం వ‌ల్ల అనేక జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ఇక కేవ‌లం ఆరోగ్య ప‌రంగానే కాకుండా సౌంద‌ర్య ప‌రంగానూ క‌ర్బూజా పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌ల‌ను పోగొట్ట‌డంతో, ముడ‌త‌ల‌ను దూరం చేసి య‌వ్వ‌నంగా క‌నిపించేలా చేయ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చ‌డంలో క‌ర్బూజ పండు స‌హాయ‌ప‌డ‌తుంది.మ‌రి ఇంత‌కీ క‌ర్బూజ పండు చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముడ‌త‌ల స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారు.ముందుగా బాగా పండిన క‌ర్బూజ పండు నుంచి గింజ‌లు రాకుండా గుజ్జు తీసుకోవాలి.

Advertisement
Beauty Benefits Of Muskmelon! Beauty, Benefits Of Muskmelon, Muskmelon Face Pack

ఆ గుజ్జులో పాలు మ‌రియు తేనె మిక్స్ చేసి.ముఖానికి, మెడ‌కు అప్లై చేసి బాగా ఆరిపోనివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు పోయి య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా చర్మం మారుతుంది.

Beauty Benefits Of Muskmelon Beauty, Benefits Of Muskmelon, Muskmelon Face Pack

క‌ర్బూజ పండు నుంచి గుజ్జు తీసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో కొద్దిగా ముల్తాని మట్టి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.ఇలా వేసుకున్న అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల.ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇక ఒక బౌల్ తీసుకుని.అందులో క‌ర్బూజ పండు గుజ్జు, లావెండర్ ఆయిల్ వేసి రెండిటిని క‌లుపుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ముఖానికి రుద్దుతూ అప్లై చేయాలి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తుంటే.ముఖంపై మృత‌క‌ణాలు, మురికి పోయి చ‌ర్మం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

తాజా వార్తలు