బీస్ట్ సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ఈ యాక్టర్ టాలెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన బీస్ట్ సినిమా( Beast Movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా కొంతమందికి నచ్చగా మెజారిటీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేదు.

బీస్ట్ సినిమాలో "ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్" అనే డైలాగ్ ఎంతలా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీటీవీ గణేశ్( VTV Ganesh ) ఆ డైలాగ్ చెప్పిన నటుడు కాగా ఆ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

జైలర్ సినిమాలో( Jailer ) వీటీవీ గణేశ్ కామెడీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలుగు సినిమాలతో సైతం వీటీవీ గణేశ్ బిజీ అవుతుండగా ఈ నటుడికి అంతకంతకూ క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.

రెడ్ అనే సినిమాతో తమిళంలో వీటీవీ గణేశ్ కెరీర్ మొదలైంది.

Advertisement

వీటీవీ గణేశ్ కామెడీ టైమింగ్ ఇతర నటులకు భిన్నంగా ఉంటుంది.విన్నైతాండి వరువాయా సినిమా వీటీవీ గణేశ్ క్రేజ్ ను పెంచింది.భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో టాలీవుడ్ లో వీటీవీ గణేశ్ కెరీర్ ను మొదలుపెట్టగా ఈయన కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వీటీవీ గణేశ్ మంచి పేరును సొంతం చేసుకోవడం గమనార్హం.

వీటీవీ గణేశ్ తన సక్సెస్ తో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.వీటీవీ గణేశ్ వయస్సు 62 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా వరుస ఆఫర్లతో ఆయన సత్తా చాటుతున్నారు.వీటీవీ గణేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తెలుగులో కూడా వీటీవీ గణేశ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు