గత కొద్ది రోజులుగా తిరుమలలో( Tirumala ) వన్యప్రాణులు భారీగా సంచరిస్తూ ఉన్నాయి.ముఖ్యంగా చిరుతల ఆలకిడి తిరుమల భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి.
తిరుమల పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిస్తూ ఉంటారు.అయితే గత కొద్దిరోజులుగా వన్యప్రాణుల భయం వెంటాడుతూ ఉంది.
ముఖ్యంగా శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతల సంచరిస్తూ ఉన్నాయి.ఆల్రెడీ ఒక పాపని చిరుత చంపడం తెలిసిందే.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకమైన బోన్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో గత వారం రోజుల వ్యవధిలో రెండు చిరుతలు చిక్కగా నాలుగు రోజుల క్రితం బోనులో మరో చిరుత చిక్కింది.
ఇదిలా ఉంటే ఆదివారం తిరుమల నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం చేయగా దాన్ని చూసి భక్తులు భయభ్రాంతులకు గురి అయ్యారు.సమాచారం అందుకున్న అధికారులు దాన్ని పట్టుకున్నెందుకు రంగంలోకి దిగారు.
కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ ఎలుగుబంటి( Bear ) సంచారం చేయడం జరిగింది.అయితే మరోసారి భక్తుల నడక మార్గ సమీపంలోకి ఎలుగుబంటి రావడంతో.
టీటీడీ అధికారులు అటవీశాఖ అధికారులు( Forest officials ) దాన్ని పట్టుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.